Poses As Nurse: సినిమాను మించిన స్టోరి.. స్నేహితుడి భార్యను చంపేందుకు నర్సువేషంలో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poses As Nurse: నర్సుగా నటించి ఆస్పత్రిలో ఉన్న స్నేహితుడి భార్యనే హతమార్చాలని ప్రయత్నించింది ఓ మహిళ. ఇంజెక్షన్ వేసి ఆమెను చంపాలని వ్యూహం పన్నింది. కానీ అది బెడిసికొట్టి పోలీసులకు చిక్కింది. కేరళలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా నటిస్తూ స్నేహితుడి భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన 30 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని పరుమాల ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. కేరళలో నర్సు వేశంలో వెళ్లి స్నేహితుడి భార్యను హత్యచేయాలని పథకం పన్నింది ఓ మహిళ. బాధితురాలి పేరు స్నేహ కాగా.. ఆమె భర్త విదేశాల్లో ఉంటారు. నిందితురాలు పేరు అనూష.. స్నేహ భర్త స్నేహితురాలు. అనూష సోదరి, స్నేహ భర్త ఒకే క్లాస్‌మేట్స్. ఏ కారణంతో తెలియదు గానీ స్నేహితుని భార్యను అనూష అంతమొందించాలనుకుంది.
Also Read: Tomato: టమాటాల కోసం క్యూ లైన్లో.. వీడియో వైరల్
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
గర్భవతిగా ఉన్న స్నేహ.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. అందుకు తగ్గ వ్యూహాన్ని పన్నింది అనూష. నర్సు వేషంలో వెళ్లి స్నేహను చంపేయాలనుకుంది. శుక్రవారం నర్స్‌గా మారువేషంలో స్నేహ గదిలోకి ప్రవేశించిన నిందితురాలు మరో ఇంజక్షన్ వేయాలని చెప్పింది.”ఆమె ఒక ఖాళీ సిరంజిని ఉపయోగించి బాధితుడి సిరలోకి గాలిని రెండుసార్లు ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది, కానీ విఫలమైంది. ఆమె మళ్లీ ప్రయత్నించినప్పుడు, స్నేహ తల్లి అనుమానం వచ్చి నర్సింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది” అని పోలీసులు తెలిపారు. ఆసుపత్రి అధికారులు నిందితురాలిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి భర్త స్నేహితురాలు అనూషను అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!