బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం బాలకృష్ణ తదుపరి చిత్రం భగవంత్ కేసరి. గార్జియస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సారథ్యం వహిస్తున్నారు.
జైలర్ సినిమా మత్తులో నుంచి తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ రాకముందే.. రజినీ సినిమా గురించి మరో అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
2024లో వచ్చేది జనసేన - టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జగన్ లాగా డబ్బు పేరుకుపోయి ఉన్న నేతను ఎలా అడ్డుకోవాలో తనకు తెలుసన్నారు. తమకు నైతికంగా బలం ఉంది కాబట్టే.. నేనింత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనే వాడిని అయ్యామన్నారు. తాను ప్యాకేజ్ తీసుకున్నానని ఆరోపిస్తున్నారని.. తనకు డబ్బంటే ప్రేమ లేదని వాళ్లకెలా చెప్పనంటూ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య బీజాలు మన సంస్కృతిలో ఎప్పుటినుంచో ఉన్నాయని.. ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. విజయవాడలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు.
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు.
పాలమూరు ప్రజాగర్జన సభలో ప్రజలందరకీ నమస్కారములు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ప్రారంభించారు. నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోడీ తెలంగాణ వాసుల మనస్సు దోచుకునే ప్రయత్నం చేశారు.
మహబూబ్‌నగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన 'పాలమూరు ప్రజాగర్జన' సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై మాటల తూటాలు సంధించారు. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ఏ రకమైన ప్రభుత్వం ఉందో చూడాలన్నారు కిషన్ రెడ్డి.
మహబూనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని మోడీ తెలంగాణకు వరాలు ప్రకటించారు. తెలంగాణలో రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.1932 కోట్ల వ్యయంతో కృష్ణపట్నం-హైదరాబాద్ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లైన్, వరంగల్-ఖమ్మం-విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు.