Bhagavanth Kesari: బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం బాలకృష్ణ తదుపరి చిత్రం భగవంత్ కేసరి. గార్జియస్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ప్రతిభావంతులైన దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సారథ్యం వహిస్తున్నారు. అక్టోబర్ 19న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ ‘గణేష్ యాంథమ్’ విడుదల చేశారు. ఇప్పుడు రెండో పాటను ఎప్పుడు విడుదల చేసేదీ కూడా వెల్లడించారు. ‘ఏ సాంగ్ దట్ డిఫైన్స్ ద బాండ్ ఆఫ్ భగవంత్ కేసరి’ అంటూ చిత్రబృందం ఈ రోజు ఓ స్టిల్‌ను కూడా విడుదల చేసింది. దీంతో పాటు ‘ఉయ్యాలో ఉయ్యాల’ సాంగ్‌ను అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Also Read: Rajinikanth: సంక్రాంతి బరిలో ‘లాల్ సలాం’.. వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
ఈ సినిమాపై ప్రముఖ నటీనటులు, టెక్నీషియన్స్, దర్శకులు పని చేస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియో, ఫస్ట్ సింగిల్‌కే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. వారి ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ చిత్రం ట్రైలర్‌ను అక్టోబర్ 8న లాంచ్ చేయనున్నట్లు సినీవర్గాల్లో నెలకొన్న తాజా బజ్ సూచిస్తోంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. భగవంత్ కేసరి చిత్రంతో అర్జున్ రాంపాల్ విలన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చారు.
ఈ సినిమాలో గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే సామాజిక కార్యకర్తగా బాలయ్య కనిపించనున్నట్లు సమాచారం. ఆయన పాత్ర కూడా గిరిజనులలో ఒకరిగా ఉంటుందట. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలో ప్రస్తావించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఓ లెక్క… ఇప్పుడీ ‘భగవంత్ కేసరి’ది మరో లెక్క అనే విధంగా సినిమా ఉంటుందని సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. కామెడీ కంటే కంటెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుందని సినీవిశ్లేషకులు భావిస్తున్నారు.