భారత దేశ అభివృద్ధిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే భారత్‌కు ఆధునిక పరికరాలతో కూడిన బలమైన సాయుధ బలగాలు అవసరమని రక్షణ మంత్రి ఆదివారం పేర్కొన్నారు. మూడు సేవల ద్వారా ఆర్థిక వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన చెప్పారు.
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
పశ్చిమ బెంగాల్‌లో జరిగిన కోట్లాది రూపాయల స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు అధికారిని వెంటనే మార్చాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.
పట్టణాల్లో నివసించే ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఇళ్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో చౌకగా గృహ రుణాలు అందించే పథకాన్ని తీసుకురానుంది. కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రణాళికను ఖరారు చేయడానికి దగ్గరగా ఉందని, దీనికి సంబంధించి త్వరలో ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
గతేడాది గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది తాను కాదని గుజరాత్ ప్రజలేనని సమావేశాల్లో ప్రకటించారు. కాంగ్రెస్ తీవ్ర ప్రచారం తర్వాత, ప్రధాని మోడీ ప్రసంగం ఎన్నికల వాతావరణాన్ని మార్చింది. ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా అదే నినాదం ఇచ్చారు.
స్థానికంగా ఆజాద్‌పూర్ మండి అని పిలువబడే ఢిల్లీలోని ఆజాద్‌పూర్ కూరగాయల మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం 5.15 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
యూనిఫాం సివిల్ కోడ్(Uniform Civil Code)పై లా కమిషన్ కేంద్రానికి తమ నివేదికను సమర్పించింది. ఇందులో స్వలింగ మినహాయినంచినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పౌరస్మృతిలో పురుషుడు, స్త్రీ మధ్య వివాహాలు ఉంటాయని, స్వలింగ వివాహాలు యూసీసీ పరిధిలోకి రావని లా కమిషన్ తమ నివేదికలో పేర్కొ్న్నట్లు తెలుస్తోంది.