చైనా నుంచి నిధులు తీసుకుని వారికి అనుకూలంగా వార్తలు రాస్తున్నారనే ఆరోపణలపై ఆన్‌లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన 30 ప్రాంగణాలపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాడి చేసింది. దీంతో పాటు న్యూస్‌క్లిక్‌కు సంబంధించిన జర్నలిస్టుల ఇళ్లలోనూ పోలీసులు సోదాలు చేశారు.
2023 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను ప్రకటించారు. ఫిజిక్స్ విభాగంలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్ ఇవ్వనున్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2023 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని పియరీ అగోస్టినీ, ఫెరెన్క్ క్రౌజ్, అన్నే ఎల్'హుల్లియర్‌లకు అందించాలని నిర్ణయించింది.
ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు.
భారత్- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది.
బ్యానర్లు , ఫోటోలు వేసుకున్నంత మాత్రానా లీడర్లు అయిపోయాం అనుకోవద్దని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. నాయకుడు ఏం చెబుతున్నాడో వినండి , దాన్ని ప్రచారం చేయండంటూ జనసేన నేతలకు ఆయన సూచించారు.
ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కేటగిరీల్లోని ఉద్యోగులకు వేతన స్కేళ్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండో పే రివిజన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ విజయభేరిని మోగించడం ఖాయమని తాజాగా టైమ్స్ నౌ సర్వేలో తేలింది. వైసీపీ ఈ సారి 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో గెలిచి క్లీన్‌స్వీప్ చేయనుందని సర్వే స్పష్టం చేసింది. టైమ్స్ నౌ నిర్వహించిన ఈ సర్వేలో వైస్సార్‌సీపీ విజయం తథ్యమని వెల్లడించింది.
సన్నాసి అంటే తిట్టు కాదు.. ఏమి లేనివాడు అని అర్థమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసీపీవాళ్లు ఆ మాటకు బాధపడితే భవిష్యత్‌లో ఆ మాట మాట్లాడను.. అది కూడా వారి ప్రవర్తన బట్టి ఉంటుందన్నారు.