Rajinikanth: జైలర్ సినిమా మత్తులో నుంచి తలైవా రజినీకాంత్ ఫ్యాన్స్ రాకముందే.. రజినీ సినిమా గురించి మరో అనౌన్స్‌మెంట్ బయటకు వచ్చింది. పొలిటికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘లాల్ సలామ్’ చిత్రంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంంలో సూపర్ స్టార్ రజినీకాంత్ మొయినుద్దీన్ భాయ్ అనే కీలకపాత్రను పోషిస్తున్నారు. క్యామియో రోల్ అయినా ఈ చిత్రంలో రజినీ కాంత్‌ది చాలా ముఖ్యమైన పాత్రగా ఉండనుంది. రజినీకాంత్ ఇప్పటికే తన డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు. లాల్ సలామ్ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్‌లు హీరోలుగా నటించారు. . రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా ఈ మూవీలో క్యామియో రోల్ చేశారు. జీవితా రాజశేఖర్ కూడా నటిస్తున్నారు. కాగా, ‘లాల్ సలామ్’ రిలీజ్ గురించి చిత్ర యూనిట్ నేడు అధికారికంగా అప్‍డేట్ ఇచ్చింది.
Also Read: Hyundai: సెప్టెంబర్‌లో హ్యుందాయ్ రికార్డ్ సేల్స్.. కలిసి వచ్చిన ఫెస్టివల్ సీజన్..
లాల్ సలాం చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. ఈ సినిమాను 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. కానీ తేదీని మాత్రం ఖరారు చేయలేదు. అయితే, వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 12 మధ్య లాల్ సలాం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్.. లాల్ సలామ్‍కు సంగీతం అందిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీ కాంత్‌తో తమ అనుబంధం కొనసాగుతుండడం తమకు గర్వంగా ఉందని లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. తమ రిక్వెస్ట్ మేరకు రజినీ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పాత్రలో నటించారన్నారు.