CM YS Jagan: నేడు వరుస కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు జగనన్న విదేశీ విద్యా దీవెన లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. వర్చువల్‌గా జరిగే ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.
Read Also: Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత భయం.. అప్రమత్తమైన టీటీడీ
అంతే కాకుండా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అందించనున్నారు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ. 1 లక్ష ప్రోత్సాహకం అందిస్తుండగా.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ. 50 వేల ప్రోత్సాహకం అందిస్తున్నారు. మరో వైపు నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆడుదాం ఆంధ్రాలో వర్చువల్‌గా పాల్గొననున్నారు సీఎం జగన్.
Read Also: AP CM secretary Duvvuri Krishna: ఎఫ్ఆర్బీఏం నిబంధనల ప్రకారమే ఏపీకి రుణాలు..
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. సాయంత్రం 5.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. ఐజీఎమ్ స్టేడియంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, హై–టీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం తాడేపల్లికి సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.