వైకుంఠ ఏకాదశి కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపటి నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులకు అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం నేటి మధ్యాహ్నం 2గంటల నుంచి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు కేటాయించాలని టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఇవాళ పవన్‌కళ్యాణ్ లోకేష్ పాదయాత్ర యువగళం విజయోత్సవ సభ కోసం విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లికి రావాల్సి ఉంది. అయినా లోకేష్ కార్యక్రమంలో పాల్గొనటానికి పవన్ విశాఖ బయల్దేరారు.
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.60 కోట్లను విడుదల చేశారు. సివిల్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి విద్యా దీవెన కింద ప్రోత్సాహకాన్ని అందించారు.
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నందున కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎంటి.కృష్ణబాబు వెల్లడించారు. కొవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని ఆయన మీడియాతో చెప్పారు.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇరు పార్టీల నేతల ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నారు. తాజాగా టీడీపీపై తీవ్రంగా వ్యాఖ్యానించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.