Bulletproof Coffee: ప్రతిరోజు ఉదయం అల్పాహారం తప్పనిసరిగా చేయాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోవాల్సి వస్తుంది. అయితే మీరెప్పుడైనా బుల్లెట్ ప్రూఫ్ కాఫీ గురించి విన్నారా? దీనినే బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు. ఈ కాఫీని అల్పాహారానికి ఒక ప్రత్యామ్నాయంగా చెప్తారు. అంటే ఈ కాఫీ తీసుకుంటే అల్పాహారం చేసేసినట్లే. బుల్లెట్ కాఫీ ఇప్పుడు కొత్తగా వచ్చిందేమి కాదు చాలా పాతదే. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బరువు తగ్గడంతో పాటు శరీరంలో మంచి కొవ్వును ప్రోత్సహిస్తుంది. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీకు శక్తిని అందించడమే కాకుండా మీ జీర్ణ శక్తిని నిర్వహించడానికి, ఆకలిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీలో ఉండే కీటో లక్షణాలు శక్తిని పొందడానికి పిండి పదార్థాలకు బదులుగా కొవ్వును కాల్చేస్తాయి, దీని కారణంగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోదు. కొవ్వును కాల్చే ఈ ప్రక్రియను కీటోసిస్ అంటారు. ఇది శక్తిని అందించడంతో పాటు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి వారు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తమ డైలీ రొటీన్‌లో కలిగి ఉన్నారు. బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ అనేది కాఫీ పొడి, నూనె అలాగే వెన్న కలిసి ఉండే పానీయం. వేడి వేడిగా తాగితే వెచ్చని క్రీమి లాటే ద్రవం తాగుతున్నట్లు అనిపిస్తుంది. దీ
బుల్లెట్ ప్రూఫ్ కాఫీని ఎలా తయారు చేసుకోవాలంటే?
*తాజా కాఫీ గింజలను పొడిగా మార్చి ఒక కప్పు కాఫీని బ్రూ చేయండి.
*కాఫీలో 1 టేబుల్ స్పూన్ మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్ (MCT) నూనెను వేయండి. సాధారణంగా ఇది కొబ్బరి నూనె నుంచి తీస్తారు.
*అనంతరం 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వెజిటేబుల్ వెన్న, ఉప్పు రహిత వెన్న లేదా పాలతో చేయని వెన్నను వేయండి.
*ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నురుగులు వచ్చేలా క్రీములా మారేంతవరకు బ్లెండర్‌లో మిక్స్ చేయాలి. అనంతరం దీనిని అదే వేడితో కప్పులోకి సర్వ్ చేసుకోవాలి.
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
*బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా అనేక పోషకాలతో సమృద్ధిగా ఉన్న బుల్లెట్‌ప్రూఫ్ కాఫీ బరువు తగ్గడంతో పాటు మీకు ఆరోగ్యకరమైన, రుచికరమైన పానీయం అని నిరూపించవచ్చు.
*శక్తిని ఇస్తుంది..
ఈ కాఫీలో ఉండే కెఫిన్ వల్ల మనకు అలసట అనిపించదు. అదనంగా, కెఫీన్ మన మెదడులోని కొన్ని న్యూరోట్రాన్స్మిటర్ల స్థాయిలను మార్చడం ద్వారా శక్తి స్థాయిలను పెంచడానికి పనిచేస్తుంది.
*జీవక్రియను వేగవంతం చేస్తుంది
ఈ కాఫీ మీ జీవక్రియను పెంచడానికి పని చేస్తుంది, ఇది మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
*తక్కువ ఆకలి అనుభూతి
బుల్లెట్‌ప్రూఫ్ కాఫీలో నెయ్యి ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు, దీనివల్ల మీరు పదే పదే ఆహారం తీసుకోరు.
*మనసును ప్రశాంతంగా ఉంచుతుంది
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, అనేక పోషకాలు మన మనస్సును తాజాదనాన్ని నింపుతాయి. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
*రోగనిరోధక శక్తి బలపడుతుంది
ఈ కాఫీలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.