Pathum Nissanka: శ్రీలంక ‘సూపర్ స్టార్’ పాతుమ్ నిశాంక.. సంగా-సూర్య-జయ లాగే..!
- అద్భుత ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిశాంక
- ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా నిశాంక
- సంగా-సూర్య-జయ లాగే నిశాంక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lanka’s New Superstar is Pathum Nissanka: అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుత ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ స్టార్ ప్లేయర్ ‘పాతుమ్ నిశాంక’. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో నిశాంక హాట్ టాపిక్‌గా మారాడు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే మూడు ఫార్మాట్లలో అద్భుత గణాంకాలు నమోదు చేసి.. భవిష్యత్తు దిగ్గజంగా ప్రశంసలు అందుకుంటున్నాడు. శ్రీలంక దిగ్గజాలు సనత్ జయసూర్య, కుమార సంగక్కర, మహేళ జయవర్ధనే లాగే నిశాంక కూడా దిగ్గజ ప్లేయర్స్ అవుతాడని లంక మాజీలు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
27 ఏళ్ల వయస్సులోనే పాతుమ్ టీ20, వన్డేలోనే కాదు.. టెస్టుల్లో కూడా నిరూపించుకున్నాడు. వన్డేల్లో ఇప్పటికే 2920 పరుగులు చేయగా.. 7 శతకాలు నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయాల్లో 2574 పరుగులతో పాటు 2 సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లోనూ 1305 పరుగులు, 4 శతకాలు నమోదు చేసి తన స్థిరత్వాన్ని చాటుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ ఇలాంటి స్థిరమైన ప్రదర్శన చేయడం యువ ఆటగాళ్లలో అరుదైన విషయం.
Also Read
Also Read: Mitchell Marsh: ఇది అవమానకర ఓటమి, ఏడుపొచ్చేస్తోంది.. మిచెల్ మార్ష్ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుతం శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌కు పాతుమ్ నిశాంక ప్రధాన బలంగా మారాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చగల సామర్థ్యంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. టెక్నిక్, సహనం, దూకుడు.. ఈ మూడు లక్షణాలు కలగలిపిన బ్యాటర్‌గా నిశాంకను క్రికెట్ నిపుణులు అభివర్ణిస్తున్నారు. చిన్న వయస్సులోనే భారీ గణాంకాలు నమోదు చేస్తూ ముందుకు సాగుతున్న నిశాంక.. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ క్రికెట్‌లో అగ్రస్థానానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు నిశాంక పేరు మార్మోగడానికి కారణం టీ20 ప్రపంచకప్ 2026లో సెంచరీ చేయడమే. ఓపెనర్ నిశాంక పటిష్ట ఆస్ట్రేలియాపై 52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సులతో 100 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
తాజావార్తలు
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
Producer Deepti: హీరోయిన్‌పై నిర్మాత సంచలన ఆరోపణలు.. ‘పేమెంట్ ఇవ్వను.. ఆ డబ్బు హార్ట్ ఆపరేషన్లకు విరాళంగా ఇస్తా’
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?