టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్ ద్వారా ప్రజలకు మేలు చేసే బాధ్యత మాదేనని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 15వ డివిజన్‌లో సుమారు 200 మంది వైసీపీ నాయకులు శనివారం టీడీపీలో చేరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం మోహిని అలంకారంలో కోదండ రాముడు భక్తులకు దర్శనమిచ్చారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో నేటి నుంచి మూడు రోజులు పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇవాళ శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు అర్చకులు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ శనివారం రాత్రి బస చేసిన చిన్నయపాలెం ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరనున్నారు.
ఏటీఎం నగదు నింపే వ్యాన్‌లో 66 లక్షల రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లి మర్రిచెట్టులో దాచారు. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్‌లో పట్టపగలే లక్షల రూపాయలు దోచుకెళ్లారు దొంగలు. ఏకంగా రూ. 66 లక్షలను ఎక్కడ దాచాలో తెలియక మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టారు.