Tammineni Sitaram: వైసీపీ మేనిఫెస్టోపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పందించారు. వైసీపీది రియాల్టీ మేనిఫెస్టో అని.. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో అని ఆయన విమర్శించారు. ప్రజల కష్టాల నుంచి బయట పడవేసే మేనిపేస్టో ఇది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ విధానాలు సంస్కరణల దిశగా వెళ్తున్నాయన్నారు. విశాఖపట్నం క్యాపిటల్ టౌన్‌గా మేనిఫెస్టోలో ప్రకటించడం ఆనందకరమని ఆయన తెలిపారు.
Read Also: YSRCP: టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత
ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు అంతా విశాఖ రాజధాని కావాలనుకుంటున్నారని ఆయన అన్నారు. విశాఖకు అంతా కనెక్టవిటి ఉందని.. రాష్ర్ట అభివృద్ధికి దోహాదపడుతుందన్నారు. చంద్రబాబుది కాపీపేస్ట్ మేనిఫెస్టో అని.. టీడీపీ మాదిరి ఏదో హామీ ఇవ్వలేదన్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేశామని.. ఇవాళ కూడా అమలు చేయగలిగినవే మేనిఫెస్టోలో పెట్టామన్నారు.