తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తయి పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతోంది
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేసీఆర్ 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో బీఆర్ఎస్ పాల్గొనదని ఆ లేఖలో తెలిపారు.
నూతన తెలంగాణ పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ శాసన సభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమా..? పేద రాష్ట్రమా అనేది అర్థం కావటం లేదన్నారు. తెలంగాణలో ఏ రంగం కూడా సంతృప్తిగా లేదన్నారు.
ఏపీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ఎగ్జిట్ పోల్స్‌లో అవే చెబుతున్నాయని ఆయన చెప్పారు. తన స్నేహితులు, బంధువుల సమాచారం మేరకు జగన్ రెండోసారి సీఎం అవుతారన్నారు.
హైదరాబాద్‌లోని ఫతేనగర్ ప్రాంతంలో ఒక మహిళ గంజాయి ప్యాకెట్లు అమ్మకాలు జరుపుతుండగా ఎస్‌ఎఫ్‌టీ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఫతేనగర్‌లో షేక్‌జామీన్ బీ అనే మహిళ గంజాయిని అమ్మకాలు సాగిస్తోంది.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.