పవన్ కల్యాణ్‌ను ఎమ్మెల్యేగా, మంత్రిగా చూడాలనేది ఆయనకే కాదు, ఆయన మద్దతుదారులకు కూడా చిరకాల స్వప్నం. పిఠాపురం ప్రజల ఆశీర్వాదంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన భారీ మెజారిటీ ఎన్నిక కావడమే కాకుండా జనసేన తరఫున పోటీ చేసిన 21 మంది కూడా గెలవడంతో అందరూ ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
చంద్రబాబు నేతృత్వంలో నేడు ఏపీ కేబినెట్ కొలువుదీరనుంది. ఏపీ ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉదయం 11.27 గంటలకు శుక్లపక్ష షష్టి తిథి వేళ కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని సభాప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి విశాఖ చేరుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. ఆయన ఆదివారం బిజీబిజీగా గడిపారు. ఇవాళ ప్రత్యేక విమానంలో ఎంపీ సీఎం రమేష్‌తో కలిసి విశాఖకు విచ్చేశారు.
బెట్టింగ్ తప్పు అని తెలిసినా కొంత మంది అదే రూట్‌లో వెళ్తున్నారు. పరువు కోసం, ఆధిపత్యం కోసం.. కారణం ఏదైనా సరే పందెం కాసి ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో జరిగింది.