రాజమండ్రి వద్ద గోదావరిలో క్రమేపీ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలోకి నీరు చేరడంతో నీటిమట్టం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 13.79 మీటర్లకు నీటిమట్టం చేరింది.
వైసీపీకి షాక్ తగిలింది. నెల్లూరు మేయర్ స్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ వైసీపీకి రాజీనామా చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంట నడుస్తామని వారు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు దృష్టి పెట్టనున్నారు. భారీ మెజారిటీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఉండేలా కసరత్తు చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఎక్కువగా స్థానాలను కైవసం చేసుకుంది.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీలో సంస్థాగత స్థాయి మార్పుల ప్రక్రియ ప్రారంభం కానుంది. కొత్త జాతీయ అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా ప్రభుత్వంలో చేరిన తర్వాత.. పార్టీకి కొత్త జాతీయ అధ్యక్షుడు వస్తారనే విషయం మరింత స్పష్టమైంది. అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం జనవరిలో పూర్తి కావడంతో లోక్‌సభ ఎన్నికల వరకు పొడిగించారు.