CM Revanth Reddy: నీట్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- నీట్ అవకతవకలపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి
- పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయింది
- సీబీఐ విచారణ సరిపోదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: నీట్ అవకతవకలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. నీట్ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని ఆయన విమర్శలు గుప్పించారు. పరీక్ష నిర్వహణలో కేంద్రం విఫలం అయిందని.. ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సరిపోదన్నారు. కోట్లమంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన అంశం, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాని మౌనం వహించడం సరికాదన్నారు. ఏ ఒక్కరి పైనో కేసు వేసి క్లోజ్ చేయడానికి సీబీఐకి అప్పగించారని.. జ్యుడీషియల్ ఎంక్వైరీ అవసరమన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన భరోసా ప్రధాని నరేంద్ర మోడీ ఇవ్వట్లేదన్నారు. మోడీ గ్యారెంటీ ఎక్కడ పోయిందని.. మోడీ గ్యారంటీ ఖతం అయిందని రేవంత్ అన్నారు. ఇప్పటికైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: KCR: ఆ కేసు కొట్టివేయాలి.. హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తన రాజకీయ జన్మ మొదలైంది కాంగ్రెస్‌లోనేనని, చివరికి ముగిసేది కాంగ్రెస్‌లోనే అంటూ వెల్లడించారు. ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరానని, పదేళ్లు కేసీఆర్ నాయకత్వంలో పనిచేశానని తెలిపారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు. ఆరునెలలుగా పరిపాలనను గమనిస్తున్నానని, అంకితభావంతో రేవంత్ నడుపుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన అందిస్తున్నారని తెలిపారు. రైతులకు మంచి జరగాలనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తాను, తన సైన్యం మొత్తం కాంగ్రెస్‌లో చేరామన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..