Bharateeyudu-2: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తావన వచ్చింది. పవన్ పేరెత్తగానే ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. ఎస్‌జే సూర్య మాట్లాడుతూ.. తన స్నేహితుడైనా పవన్ కల్యాణ్ గురించి ఇక్కడ చెప్పాలనుకుంటున్నా అంటూ చెప్పుకొచ్చారు. తాను మూడేళ్ల క్రితమే పవన్ సీఎం అవుతాడని చెప్పానని.. ఇప్పుడు అది సగం మాత్రం ప్రూవ్ అయిందన్నారు. మిగతా సగం కూడా మీరే ప్రూవ్ చేయాలని అభిమానులను ఉద్దేశించి ఎస్జే సూర్య పేర్కొన్నారు. పవన్ పేరు ప్రస్తావించగానే అభిమానుల అరుపులతో ఆడిటోరియం అదిరిపోయింది. ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ‘ఖుషీ’ సినిమా చేసిన సంగతి తెలిసిందే.
Read Also: Bharateeyudu-2 Prerelease Event: కమల్ ముందే ఆయన గొంతు మిమిక్రీ చేసిన బ్రహ్మానందం