Director Shankar: హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్‌హాసన్ ఎంతో అద్భుతంగా నటించారని, అలాంటి నటుడు ఈ దేశంలో కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని దర్శకుడు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. హీరో రామ్‌చరణ్ గొప్ప నటుడని ప్రశంసించారు. గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్‌కు సంబంధించిన షూటింగ్ ముగిసిందని.. ఇంకా 15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని డైరెక్టర్ చెప్పారు. అనంతరం వెంటనే గేమ్ చేంజర్ రిలీజ్‌కు రెడీ అవుతుందని ‘భారతీయుడు-2’ ప్రీరిలీజ్ వేడుకలో శంకర్ చెప్పారు. ఇదిలా ఉండగా.. గేమ్ చేంజర్ చిత్రంలో ఎస్‌జే సూర్య అద్భుతంగా నటించారని తెలిపారు. ఈ సినిమాలో కూడా ఎస్‌జే సూర్య మెయిన్ రోల్‌లో నటించారని చెప్పుకొచ్చారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా గేమ్ చేంజర్ చిత్రంలో ఓ రోల్ చేశారని డైరెక్టర్ శంకర్ చెప్పారు.
Read Also: Bharateeyudu-2: భారతీయుడు 2 ఈవెంట్‌లో పవన్ ప్రస్తావన.. పేరెత్తగానే దద్దరిల్లిన ఆడిటోరియం