సోదరసోదరీణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చెల్లి దుర్మరణం పాలైంది.
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. విశాఖ కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతరాష్ట్ర ముఠా ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. పిల్లలను ఎత్తుకెళ్లి లక్షల రూపాయలకు అమ్ముతున్న ముఠాలు దేశం అంతా నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా ఉన్నట్లు విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి తెలిపారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి నుంచి శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందంటూ దువ్వాడ వాణి చేసిన వ్యాఖ్యలకు దివ్వెల మాధురి కౌంటర్ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్‌ని హత్య చేయడానికి ప్రయత్నించింది దువ్వాడ వాణినే అంటూ దివ్వల మాధురి మళ్లీ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం వద్ద దెబ్బ తిన్న ఆఫ్రాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. ఆఫ్రాన్ పరిస్థితి, మరమ్మతులు చేయాల్సిన తీరును అధికారులు వివరించారు. సోమశిల నుంచి కండలేరు జలాశయానికి నీరు వెళ్లే కాలువను చంద్రబాబు పరిశీలించారు.
అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
విజయవాడ గుణదల ఈఎస్ఐ ఆస్పత్రిని కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. గత ఐదేళ్ల పాలనలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని ఆయన మండిపడ్డారు. సరైన పరికరాలు లేకుండా చేశారని.. ఉద్యోగుల భర్తీని కూడా చేయలేదన్నారు.
CM Chandrababu: అనకాపల్లి జిల్లా, కోటవురట్ల మండలం కైలాస పట్టణంలోని అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం కలుషిత ఆహారంతో అస్వస్థకు గురై చికిత్స పొందుతున్న వారిలో జాషూవా, భవాని, శ్రద్ధ, నిత్య అనే విద్యార్థులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. నర్సీపట్నం, అనకాపల్లి ఏరియా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం […]
డిసెంబర్‌లో రుణమాఫీ చేస్తామని చెప్పి జూలైలోనే రుణమాఫీ మొదలు పెట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి త్వరలో రుణమాఫీ చేస్తామన్నారు. లక్షా 20 వేల మంది రైతులు ఆధార్ నంబర్లు తప్పుగా ఇచ్చారని.. లక్షా 61 వేల రైతుల ఆధార్ కార్డుల్లో, అకౌంట్స్‌లో పేర్లు తప్పులు ఉన్నాయన్నారు.