అధికారులతో ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర, రాష్ట్రేతర పెట్టుబడుదారులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్త టెక్స్‌టైల్ పాలసీపై చర్చించారు.
ఒకప్పుడు హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న శివాజీ-లయ ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నారు. గతంలో శివాజీ, లయ కాంబినేషన్‌లో వచ్చిన మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. లయ కూడా ఇటీవలే కంబ్యాక్ ఇచ్చి వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది.
మనీ స్కీం పేరుతో నెల్లూరులో మోసం చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. కలువాయికి చెందిన వరాల కొండయ్య తన కుమారుడు సునాతం పేరుతో నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ట్రస్టు ద్వారా వివిధ ఏజెంట్ నియమించుకొని ప్రజల నుంచి రూ.500 నుంచి 6 వేల రూపాయల వరకూ వసూలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏటీఎంలను అంతరాష్ట్ర ముఠాలు కొల్లగొట్టాయి. 48 గంటల వ్యవధిలో మూడు ఏటీఎంలను దోచేశారు ఆగంతకులు. సుమారు 50 లక్షల రూపాయలు చోరీ అవ్వగా.... దొంగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలను లక్ష్యంగా చేసుకున్నారు.
రేపు సోమశిల జలాశయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. రేపు(సోమవారం) శ్రీసిటలో 8 పరిశ్రమలకు భూమి పూజ చేయడంతో పాటు మరో 16 పరిశ్రమలను ప్రారంభించనున్నారు. అలాగే ఐదు పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
నేడు ఉదయం10.30 గంటలకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో డాక్టర్ ఎం.ఎస్.గౌడ్ రచించిన "మైల్స్ ఆఫ్ స్మైల్స్" మై లైఫ్ జర్నీ పుస్తకాన్ని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆవిష్కరించారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటికి గత రాత్రి మాధురి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు.
Hero Ankith Koyya Interview For Maruthi Nagar Subramanyam Movie: రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో ఆయన కుమారుడిగా అంకిత్ కొయ్య నటించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది.