YS Jagan: కలుషితాహారం తిని విద్యార్థులు మృతి.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
- కలుషిత ఆహారంతో విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
- ఇతర విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో కలుషితాహారం తినడం వల్ల విద్యార్థులు మరణించిన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. సరైన పర్యవేక్షణ కొరవడిందనడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తుందన్నారు. చికిత్స పొందుతున్న ఇతర విద్యార్థులకు మంచి వైద్య సదుపాయాలను అందించాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తప్పుడు ప్రచారాలు, బురద జల్లుడు కార్యక్రమాలు ఇకనైనా మాని వ్యవస్థలపై దృష్టి పెట్టాలని, ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
Read Also: CM Chandrababu: కలుషిత ఆహారంతో విద్యార్థులు మృతి.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
కైలాసపట్నంలోని ఓ అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులు ఉండగా.. వారిలో 27 మంది నిన్న ఉదయం అనారోగ్యానికి గురయ్యారు. వారికి వాంతులు, విరేచనాలు కావడంతో సిబ్బంది హూటాహూటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక, తీవ్ర అస్వస్థతకు గురైన స్టూడెంట్స్ లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నలుగురు మరణించగా.. మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో.. డిప్యూటీ డీఈఓ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగడంతోనే విద్యార్థులు ఆనారోగ్యం బారిన పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నలుగురు విద్యార్థుల మృతితో.. కైలాసపట్నంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!