అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది.
AP Govt: స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.
కాకినాడ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. కిర్లంపూడి మండలం రాజుపాలెం సచివాలయం దగ్గర గ్రామస్థులతో సీఎం మాట్లాడారు. ఏలేరు వరద ముంపు సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఏపీఎంసీ ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సింగపూర్ దేశం ప్రతిపాదించగా భూటాన్ దేశం మద్దతుతో ఆయా దేశాల ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద జలవనరుల శాఖ బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ చేపట్టింది. ప్రస్తుతం పడవల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న భారీ పడవలను క్రేన్ల సాయంతో తీయడం సాధ్యం కాకపోవడంతో ముక్కలు చేసి తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
విజయవాడలోని విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి కండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీతో పాటు బుడమేరు ప్రవహించే మార్గాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు.
మద్యం పాలసీ రూపకల్పనపై కేబినెట్ సబ్ కమిటీ తొలిసారిగా సమావేశమైంది. ఐదుగురు మంత్రులతో మద్యం విధానంపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనాల విధి విధానాల రూపకల్పన, వరద సాయం పర్యవేక్షణకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.