కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ తో తెలంగాణ మంత్రులు, టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పీయూష్ గోయల్ తో ఈ బృందం సమావేశమైంది. ఈ సమావేశం లో మంత్రి కేటీఆర్ తో పాటు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీలు, కేంద్ర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారిన ధాన్యం కొనుగోళ్ల అంశం పై కేంద్రం […]
సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ కుడి కాలికి గాయమైంది. మంగళవారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా రాయల చెరువు లీకేజీ, ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు కు చేరుకున్నారు. అక్కడి నుండి కొండపై కిలోమీటరు మేర నడుచుకుంటూ రాయల చెరువు కట్ట వద్ద కు చేరుకున్నారు. అయితే… కొండ నుండి దిగే సమయంలో నారాయణ కుడి కాలు బెణికింది. కాలుకు వాపు రావడంతో పైకి లేవలేక అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో చెరువు […]
ఢిల్లీ ముఖ్యమంత్రి… అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం పదవిలో ఉన్నప్పటికీ ఆయన మామూలు వ్యక్తిగానే వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన ఓ సాధారణ ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఆయన లూధియానాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దిలీప్ తివారి అనే ఆటో డ్రైవర్.. సీఎం గారు మీరు చాలా మంది ఆటోడ్రైవర్లకు సాయం చేశారు… ఈ పేద ఆటోడ్రైవర్ ఇంటికి భోజనం చేయడానికి రాగలరా అంటూ ఆహ్వానించాడు. […]
సిద్దిపేట మాజీ కలెక్టర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు ,జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేసాడని ఆరోపణలు చేశారు. ఆ పైసలు వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్నాయి కనుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇంచార్జి గా వెంకట్రామిరెడ్డికి వచ్చారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి ఏమి పాలు […]
యాక్షన్ హీరో విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతోంది ‘సామాన్యుడు’. నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ట్యాగ్ లైన్. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా తు. పా. శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ , లిరికల్ వీడియోను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభించింది. నిజానికి ఈ […]
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ సర్కార్ పై టీడీపీ యువ నేత నారా లోకేష్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్ అంటూ నిప్పులు చెరిగారు నారా లోకేష్. పల్లె పోరు లో ఫ్యాన్ కి ఓటేస్తే గ్రామాల రూపురేఖలు మారుస్తానన్న జగన్ రెడ్డి గారు ఇప్పుడు ఏకంగా పంచాయతీ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ బ్యాంకు తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 50 లక్షల మంది విద్యార్థులకు విద్యా నైపుణ్యం పెంచేందుకు ప్రపంచ బ్యాంకు తో 250 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం చేసుకుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ తరగతుల విద్యార్థులకు సాయం అందించే లక్ష్యం తో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నెల 18 వ […]
ఏపీలో కరోనా కేసులు రోజు రోజు తగ్గు ముఖం పడుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విడుదల చేసిన హెల్త్ బులి టెన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 26, 119 శాంపిల్స్ పరీక్షించగా.. 196 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.. ఒకరు కరోనా తో మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 242 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా టెస్ట్‌లు కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల […]
తెలంగాణ సీఎం కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా…? అరుణాచల్ ప్రదేశ్ పై ఏమి మాట్లాడారని నిలదీశారు డీకే అరుణ. మీకు ఉన్నదంతా ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలి… దానితో బతకాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఎద్దేవా చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలువు… తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు… పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని […]