సిద్దిపేట మాజీ కలెక్టర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి జాయింట్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మల్లన్న సాగర్, కొకపేట, కొల్లూరు ,జహీరాబాద్ భూముల పేరు మీద దండిగా దోపిడీ చేసాడని ఆరోపణలు చేశారు. ఆ పైసలు వెంకట్రామిరెడ్డి దగ్గర ఉన్నాయి కనుకే ఎమ్మెల్సీ ఇచ్చారని ఫైర్ అయ్యారు.
ఇప్పుడు మెదక్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థికి ఇంచార్జి గా వెంకట్రామిరెడ్డికి వచ్చారని తెలిపారు. వెంకట్రామిరెడ్డి ఏమి పాలు అమ్మి, కష్టపడి కూలి చేసి డబ్బులు సంపాదించలేదని ఫైర్ అయ్యారు. అవి మన మెదక్ జిల్లా డబ్బులేనని.. అక్కడ డబ్బులు తీసుకోని.. ఇక్కడ ఓటు వేయండని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో వెంకట్రామిరెడ్డి సంగతి చూస్తామని వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.