ఏపీకి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న దక్షిణమధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం మరియు పరిసర ప్రాంతమైన ఆగ్నేయ బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్లు ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో రాగాల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి శ్రీలంక మరియు దక్షిణ తమిళనాడు […]
అక్టోబర్ 29వ తేదీన యంగ్ హీరో నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ చిత్రం విడుదలై మోడరేట్ సక్సెస్ ను అందుకుంది. తాజాగా అతని మరో సినిమా కూడా విడుదలకు సిద్ధమైంది. నిజానికి నాగశౌర్య మేకోవర్ తో తెరకెక్కిన ‘లక్ష్య’ చిత్రం ఈ నెల 12న విడుదల కావాల్సింది. కానీ దీనిని డిసెంబర్ కు వాయిదా వేశారు. అయితే నాగశౌర్య నటించిన ఈ 20వ సినిమా రిలీజ్ డేట్ ను బుధవారం నిర్మాతలు నారాయణ్ దాస్ కే నారంగ్, […]
టాలీవుడ్ లో రష్మిక హాట్ కేక్. ఏ స్టార్ హీరో సినిమా మొదలైనా హీరోయిన్ గా ముందు పరిశీలనలోకి వచ్చే పేరు రష్మిక. ఇక బాలీవుడ్ లోనూ అమ్మడి పేరు మారుమ్రోగుతోంది. 2020లో నేషనల్ క్రష్‌గా మారినప్పటి నుండి హాట్ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన ప్రతి వార్త దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక రష్మిక ఇంటిపేరు గతంలో కూడా చర్చకు దారితీసినప్పటికీ ఇటీవల ఆమె షేర్ చేసిన పాస్ పోర్ట్ ఫోటో మాత్రం చర్చనీయాంశంగా […]
సీఎం కేసీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ సర్కార్ పై ఆమె మండిపడ్డారు. ఢిల్లీ రాజకీయాలు చేసే దొరగారికి ఇక్కడి రైతుల చావులు, నేతన్నల ఆత్మహత్యలు కనిపించడం లేదంటూ నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడి రాక, పండిన పంట కళ్ళ ముందు కొట్టుకుపోతుంటే, అప్పులు తీరక గుండెలు ఆగిపోతుంటే కేసీఆర్ గారికి మాత్రం కనిపించడం లేదని ఆగ్రహించారు వైఎస్ షర్మిల. దొరా.. పంటలు కొనండి అని గుండెలు ఆగేలా […]
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని… గత శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకునే ప్రక్రియకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముంద్ర వేసింది. వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకునే ప్రక్రియను పూర్తిచేసిన కేంద్రం… రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరణకు సర్వం సిద్ధమైంది. అలాగే…. మరో 4 నెలల పాటు ఉచిత […]
అన్నమయ్య ప్రాజెక్టును రీ డిజైన్ చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా డిజైన్ చేయాలి, కానీ 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసేలా అప్పుడు డిజైన్ చేశారని సీఎం పేర్కొన్నారు. కాని దురదృష్టవశాత్తూ ఇప్పుడు 3.2 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని… 2017లో అన్నమయ్య ప్రాజెక్టుపై నివేదిక కూడా ఇచ్చారు, ప్రాజెక్టును మెరుగుపరచమన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం విధానాల కారణంగా […]
జగన్ సర్కార్ పై మరోసారి రెచ్చి పోయారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలోని పాప నాయుడు పేట వద్ద వరద భాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వరి వేయద్దు అంటున్నారు, గంజాయి ఎయ్యాలా? అని నిప్పులు చెరిగారు. ప్రపంచంలో నే ఏపీ కి చెడ్డపేరు తెప్పిచ్చారని… ఇది ప్రజాస్వామ్యం కాదు. ఉన్మాద స్వామ్యమని నిప్పులు చెరిగారు. మడమ తిప్పను అని గిరగిరా తిప్పుతూనే ఉన్నాడు. తుగ్లక్ నయం ఈ జగన్ తుగ్లక్ కంటే అంటూ […]
నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో లేకపోవడంతో… టీఆర్‌ఎస్ పార్టీ ఏక గ్రీవంగా విజయం సాధించింది. అయితే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక […]
గత శుక్రవారం… మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ చట్టాల రద్దుపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు అంటే… (నవంబర్ 29న) “మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు”ను లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సభా కార్యకలాపాల జాబితా సిధ్దం చేసింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు… కేంద్ర […]