రెబల్ అభ్యర్థి బరిలో ఉండటంతో టీఆర్ఎస్‌కు ఇబ్బందిగా మారిందా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరి దృష్టి ఆ జిల్లాపైనే ఉందా? కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీలో లేకపోయినా.. గులాబీ శిబిరంలో గుబులెందుకు? లెట్స్ వాచ్..! రెబల్ అభ్యర్థిగా రవీందర్‌సింగ్..! తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుచోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరో ఆరుచోట్ల పోటీ నెలకొంది. ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు పక్క రాష్ట్రాల్లోను ఈ శిబిరాలు నడుస్తున్నాయి. ఈ హీట్‌లో ప్రస్తుతం అందరి దృష్టీ ఉమ్మడి […]
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 9,765 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,763 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 477 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,548 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ […]
తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ లుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి… ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు గా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీ హరి, బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, తక్కళ్ల పల్లి […]
కర్ణాటక మెడికల్ కాలేజీలో ఫ్రెషర్స్ పార్టీ కొంపముంచింది. కరోనా నిబంధనలు గాలికొదిలేసి ఫ్రెషర్స్ పార్టీ జరుపుకోవడంతో… వందలాది మంది విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. ధార్వాడ్ మెడికల్ కాలేజీలో కరోనా కేసుల సంఖ్య 182కు చేరింది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ధార్వాడ్ మెడికల్ కాలేజీ కోవిడ్ క్లస్టర్‌గా మారిపోయింది. బాధితుల్లో మెజార్టీ సంఖ్య టీకా రెండు డోసులు తీసుకొన్నవారే కావడం.. మరింత టెన్షన్ పుట్టిస్తోంది. ధార్వాడ్ జిల్లాలోని ఎస్‌డీఎమ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ […]
ఏపీకి మరో తుఫాన్ ముప్పు ముంచుకొస్తోంది. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండ్రోజుల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అండమాన్ సముద్రం పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. మరికొన్ని గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. తర్వాత మరో 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి… తర్వాత తుఫాన్‌గా బలపడుతుందని అంటున్నారు వాతావరణ […]
క్రిస్మస్, సంక్రాంతి పండగల దృష్ట్యా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌కు గడువు ను పొడిగించింది. దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ గడువును పొడిగించింది. ప్రస్తుతం 30 రోజుల ముందు మాత్రమే ముందస్తు రిజర్వేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచీ ఈ గడువును 60 రోజులకు పొడిగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి […]
సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి బావిలో పడిపోయింది. అందులో ఉన్న వారితో పాటు…వారిని రక్షించేందుకు…బావిలోకి దిగిన గజ ఈతగాడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. శాయశక్తుల కష్టపడి.. బావిలో పడిన కారును బయటకు తీసే క్రమంలో అందులోనే చిక్కుకుపోయాడు. ఆరు గంటలు శ్రమించి… చివరకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. మిగిలిన గజ ఈతగాళ్లు.. క్రేన్ సాయంతో కారును బయటకు తీయగా.. అందులో తల్లీకొడుకుల మృతదేహాలు బయటపడ్డాయి. మెదక్ […]
తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్న సంగతి తెలిసిందే. పల్లె వెలుగుకు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌లు, ఇతర సర్వీసులకు 30 పైసలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ సీఎం కేసీఆర్.. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే… కచ్చితంగా ఆర్టీసీ ఛార్జీల పెంపుకే.. సీఎం కేసీఆర్ మొగ్గు చూపే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే… ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి… ట్విట్టర్ వేదికగా […]
వరిధాన్యం, బియ్యం సేకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. వరిధాన్యం కొనుగోలుపై లోకసభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి సమాధానం ఇచ్చారు. 2018-19 లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి 48.06 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించగా, తెలంగాణ నుంచి 51.90 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్లు వివరించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, […]
ఢిల్లీః జీఎస్టీ వసూళ్ల పై… కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. నవంబర్ మాసం- 2021 జీఎస్టీ వసూళ్ల గణాంకాలను ఇవాళ వెల్లడించింది కేంద్ర ఆర్థిక శాఖ. నవంబర్ నెలలో దేశ వ్యాప్తంగా ఏకంగా… రూ.1,31,526 కోట్లు జీఎస్టీ వసూళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. సీజీఎస్టీ రూ. 23,978 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ. 31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ. 66,815 కోట్లు, సెస్ రూపంలో మొత్తం రూ. 9,606 కోట్లు వసూలు అయినట్లు ప్రకటన […]