తెలంగాణలో యథావిధిగా స్కూళ్లు నడపాల్సిందేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు బంద్ అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన మంత్రిమండలి సమావేశంలో సైతం స్కూళ్లు నడపాల్సిందేనని సీఎం చెప్పారని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాఠశాలలకు సెలవు అంటూ వస్తున్న ప్రచారాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దన్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిద్దామని, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. […]
అమరావతి : ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ పర్యటించనున్నారు. ఆయన తో పాటు.. నీతి ఆయోగ్ సభ్యులు కూడా ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా వీరపనేని గూడెంలో రైతులతో ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ మాట్లాడనున్నారు. అనంతరం… రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయాన్ని సందర్శించి డ్వాక్రా మహిళల బృందాలతో భేటీ కానుంది నీతి ఆయోగ్ బృందం. ఇక ఆ తర్వాత… మధ్యాహ్నం సీఎం జగన్ […]
మన దేశంలో పసిడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా మొన్నటి వరకు బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. అయితే… గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 44,850 కి చేరింది. 10 […]
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తొలిగిపోవడంతో ఓరుగల్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల కోడ్‌కి.. ఎమ్మెల్యేలకు లింకేంటి? కోడ్ అమలులో ఉన్నప్పుడు వారికి కలిసొచ్చిందేంటి? ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటి? రైతులకు ఎలా సర్దిచెప్పాలో తెలియక ఎమ్మెల్యేల ఆందోళన..! ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా వ్యూహాలే రచించారు. చివరకు వారు అనుకున్నదే అయింది. అధిష్ఠానం దగ్గర మార్కులు వేయించుకున్నారు. ఇంత […]
టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ప్రకటన ఎప్పుడు? ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ పూర్తికావడంతో ఇకపై సంస్థాగతంగా పార్టీ కూర్పుపై దృష్టి పెడతారా? రాష్ట్ర కమిటీలో చోటు దక్కేదెవరికి? డ్రాప్ అయ్యేది ఎవరు? టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారా? ఆ మధ్య తెలంగాణ భవన్‌లో వరసగా టీఆర్‌ఎస్ నేతలతో మీటింగ్స్ జరిగాయి. నియోజకవర్గాల వారీగా సమావేశాల దుమ్ము దులిపేశారు. జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు.. ఆ తర్వాత టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీపై ప్రకటన ఉంటుందని అనుకున్నారు. సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ […]
సీఎం కేసీఆర్‌పై మరోసారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బండి సంజయ్ హెచ్చరించారు. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్ ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్ హౌస్ రాసిస్తావా అని చురకలు అంటించారు బండి సంజయ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర్ అయ్యారు. నాలుకకు, […]
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ముసుగులో ఉన్న ఒక స్మగ్లర్ అని… తెలంగాణలో పండే నాణ్యమైన బియ్యాన్ని ప్రైవేటుగా రైస్ మిల్లర్లకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని ఆగ్రహించారు. తెలంగాణకు కేంద్రం ఏం చేయడం లేదని.. అందులో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు గురించి ప్రస్తావన చేస్తాడని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు స్థల కేటాయింపు జరగలేదని… రీ సైకిల్ బియ్యాన్ని టీఆర్ఎస్ నేతలు ఎఫ్.సి.ఐ […]
కాంగ్రెస్‌లో అంతే..! ఒకరంటే ఇంకొకరికి గిట్టదు. నువ్వెంత అంటే.. నీకంటే తక్కువ..! నాకేంటి అనుకుంటారు. ఇప్పుడా ఆ సీన్ మారుతుందా? వస్తారని అనుకున్న వాళ్లు డుమ్మా కొడుతున్నారా? రారని అనుకున్నవాళ్లు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నారా? ఎంపీ కోమటిరెడ్డి వస్తారని ఎవరికీ తెలియదా? తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష కాంగ్రెస్‌లో అనేక రాజకీయాలకు వేదికైంది. దీక్షకు పీసీసీ కసరత్తు చేసినప్పుడు పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్‌గా వచ్చేవాళ్లు వస్తారు అని అనుకున్నారు.ఈ జాబితాలో లేని వ్యక్తి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. […]
కుప్పంలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. రాజకీయ సభలు.. సమావేశాలు లేవు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరు మరోసారి అక్కడ చర్చగా మారింది. నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. ఇంతకీ కుప్పంలో ఏం జరుగుతోంది? కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్స్..! కుప్పం మరోసారి పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్. టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ పెరుగుతుందా అనేట్టుగా అక్కడ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం […]