ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్‌కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి? రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ..!కుప్పం ఓటమిపైనా పోస్టుమార్టం చేస్తున్నారా? మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన […]
ఆ పార్టీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలు.. నలుగురు ఎంపీల బలం. కానీ.. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 70 చోట్ల గెలిచి అధికారం చేపడతామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. గెలుచుడు మాట దేవుడెరుగు..? అసలు అంత మంది అభ్యర్థులు వాళ్లకు ఉన్నారా? ఎన్నికల్లో వాళ్లకు అంత సీన్ ఉందా? సొంత పార్టీలోనే వినిపిస్తున్నా ప్రశ్నలివి. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని ప్రకటనలు..! గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచింది ఒక్కటే. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో […]
పీఆర్సీ నివేదిక కోసం కొద్ది రోజులుగా ప్రభుత్వంపై కత్తులు నూరుతున్న ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం జగన్ ఝలక్ ఇచ్చారా? రచ్చ చేస్తున్నవారితో చర్చించకుండానే.. కీలక ప్రకటన చేసేశారా? ఆ ప్రకటన తమవల్లే సాధ్యమైందని ఉద్యోగ సంఘాల నాయకులు కాలర్ ఎగరేసుకోకుండా సీఎం స్ట్రాంగ్ స్ట్రోక్ ఇచ్చారా? పీఆర్సీపై తిరుపతి పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన..! తాడో పేడో తేల్చుకుంటాం..! ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు..! పీఆర్సీ నివేదిక ప్రకటిస్తారా లేదా అని రోడ్డెక్కి కార్యాచరణ […]
ఉత్తరాంధ్రలో జవాద్ తుపాన్ పరిస్థితులపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ప్రాణనష్టం ఉండకూడదని.. ఒక్క మరణం కూడా సంభవించొద్దని పేర్కొన్నారు. ఆ మేరకు అధికారులు పూర్తి అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. సహాయ కార్యక్రమాలు, పనుల కోసం తుపాన్ ప్రభావిత జిల్లాలకు రూ.10 కోట్ల చొప్పున నిధులు అందుబాటులో ఉంచాలని… సహాయ చర్యల్లో […]
ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు నిన్నటి కంటే ఇవాళ కాస్త పెరిగాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,603 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,974 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 415 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 8,190 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ […]
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పంజాబ్ లో రైతుల సెగ తగింది. ఆమె కారును పలువురు రైతులు కీరత్‌పురలో అడ్డుకున్నారు. చండీఘడ్-ఉనా హైవేపై ఉన్న కీరత్‌పూ ర్ సాహిబ్ వద్ద ఈ ఘటన జరిగింది. పెద్ద సంఖ్యలో రైతులు ఆమె కారును అడ్డుకున్నారు. అయితే, కంగానా రనౌత్ కారుపై దాడి గురించిన సమాచారం ఏదీ తన వద్ద లేదని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. ఘటనకు సంబంధించిన వివారాలు తెలుసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు. కాగా… […]
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని నారా చంద్రబాబునాయుడు అన్నారు. రోశయ్య పరిపాలనాదక్షుడిగా, ఆర్థిక నిపుణుడిగా […]
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇంత వరకూ 38 దేశాలకు ఈ వైరస్ పాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇంత వరకూ ఒక మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటోంది. మన దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు డెల్టా వేరియంట్ కారణమైంది. అప్పట్లో 90 శాతం కేసులకు డెల్టా వేరియంటే కారణం. అయితే… తాజాగా వెలుగు చూసిన […]
ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంబంధించి.. తదుపరి కార్యాచరణ విషయమై.. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ మరోసారి దాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ వ్యవసాయ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ఎంపీలతో ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించనున్నారు తెలంగాణ సీఎం. ధాన్యం కొనుగోళ్ల విషయం పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ […]
సిద్దిపేట జిల్లా తొగుటలో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిని కరెంట్ షాక్ ఇచ్చి చంపాడు ఓ కర్కశ తండ్రి. ఈ దారుణ సంఘటన.. శుక్రవారం… తొగుటలోని వెంకట్రావ్‌పే టలో జరిగింది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. వెంకట్రావ్‌పేట కు చెందిన మిరుదొడ్డి సునీత, రాజశేఖర్ దంపతులకు కూతురు ప్రిన్సీ ఉంది. చిన్నారిని.. ఆడించడానికి రాజశేఖర్ మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలోనే… షాటర్ వైర్ తో తన కూతరు కాళ్లకు షాక్ ఇవ్వడంతో చిన్నారి […]