ఒమిక్రాన్..ప్రపంచాన్ని ఠారెత్తిస్తున్న కోవిడ్ కొత్త వేరియంట్. ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసింది. ఇది అనేక దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డెల్టా కన్నా ఐదారు రెట్లు వేగంగా వ్యాపిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికి పదిహేను దేశాలలో వీటి ఉనికిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనేక ప్రపంచ దేశాలు తమ దేశ సరిహద్దులను మూసివేశాయి. అన్ని మార్గాలలో దక్షిణాఫ్రికా నుంచి రాకపోకలను నిషేధించాయి. మన దేశం కూడా తగిన ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు మన […]
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరలు పెంచి… ప్రజల నడ్డి విరస్తున్నారని ఫైర్ అయ్యారు. పాలన చేతకాకపోతే… రాజీనామా చేయండి సారూ అంటూ చురకలు అంటించారు. వైఎస్ పాలనలో మున్సిపల్ పన్ను, కరెంట్ బిల్లులు, బస్ ఛార్జీలు ఏవీ కూడా అణాపైసా పెంచింది లేదని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ పరిపాలనలో విద్యుత్తు, ఆర్టీసీ సంస్థలను నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు. నష్టాలను పూడ్చు కొనేందుకు ఇప్పుడు బస్ […]
హైదరాబాద్ నలువైపులా నిర్మించే మొత్తం 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవలు అందించాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రపంచ ఎయిడ్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలను చైతన్యం చేయడం కోసం డిసెంబర్ 1వ తేదీన ఎయిడ్స్ దినోత్సవంగా […]
నష్టాల కారణంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారని.. గత రెండు రోజుల నుంచి ఓ వార్త వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై స్వయంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. బస్సు డిపోలను మూసేస్తున్నారు.. భూములు అమ్ముతున్నారనే వార్తలు వస్తున్నాయని… కానీ, ఆర్టీసీ యాజమాన్యానికి అలాంటి ఆలోచన లేదన్నారు సజ్జనార్. ఆర్టీసీ బస్సు డిపోలు మూసివేస్తున్నారనేది పూర్తి అవాస్తవమని వెల్లడించారు. ఆర్టీసీ చార్జీలను పెంచాల్సిన అవసరం ఉందని.. కొన్ని కారణాల వల్ల […]
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఆయన కుటుంబ సభ్యులు.హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేశారు. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1:00 కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్య క్రియలు జరుగనున్నాయి. ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు కొనసాగనుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమయాత్ర. ఇక […]
తిరుమల రెండో ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేసింది టీటీడీ పాలక మండలి. 14వ కిలో మీటర్ వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో తొలగింపు పనులు చేపట్టారు సిబ్బంది. 16 వ కిలో మీటర్ వద్ద భారీ కోతకు గురైంది రోడ్డు. అలాగే…. 14వ కిలో మీటర్ వద్ద కొండచరియలు తొలగింపు పూర్తి అయితే… లింక్ రోడ్డు మీదుగా వాహనాలు మళ్లింపు చేపట్టే అవకాశం ఉండనుంది. 16వ కిలో మీటర్ వద్ద మరమత్తులకు నెలల […]
మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,954 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,023 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపు దిగి రావడం శుభపరిణామం. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 267 మంది మృతి చెందారు. […]
నిన్నటి రోజున ఐపీఎల్ మెగా వేలం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ వేలంలో ఎవరు.. ఏ ధరకు కొనుగోలు అయ్యారో తెలుసుకుందాం. ఐపీఎల్‌లో అత్యధిక ఐదుసార్లు టైటిల్‌ను సొంతం చేసుకున్న జట్టు ముంబయి ఇండియన్స్. ఈసారి సారథి రోహిత్ శర్మతోపాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్‌ను తన వద్దే ఉంచుకుంది. ఇషాన్ కిషన్‌తోపాటు ఫిట్‌నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యను మళ్లీ కొనుగోలు చేసే అవకాశం ఉంది. నలుగురి కోసం 42 […]
బీహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రమాణం చేసిన మరుసటి రోజే, ఈ సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ సంఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్రం మొత్తం మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయని మండిపడిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలన్నారు. ఇక ఈ సంఘటనపై సీఎం నితీశ్ కుమార్ […]
భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా పిల్లలకు కోవోవాక్స్ టీకాలు వేయాల్సి ఉంటుందన్నారు అదర్ పునావాలా. కోవోవాక్స్ టీకా ఆరు నెలల్లో అందుబాటులో ఉంటుందని, ప్రస్తుతం ట్రయల్స్ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి భద్రతా పరమైన సమస్యలు ఉత్పన్నం కాలేదని స్పష్టం చేశారు. కోవోవాక్స్‌తో రెండేళ్లలోపు పిల్లలకు టీకాలు వేయడం తమ విధానమన్నారు. కోవోవాక్స్ వ్యాక్సిన్ స్టాక్ భారీగానే ఉందని, డ్రగ్ నియంత్రణ సంస్థల ఆమోదం పొందిన తర్వాతే…. భారత్‌తో పాటు ప్రపంచానికి అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా టీకా […]