తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నేత విజయశాంతి కెసిఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే కేసులు పెరుగుతున్నాయని మండిపడ్డారు. “తెలంగాణలో కోవిడ్ వ్యాప్తికి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే సగం కారణమని స్పష్టమవుతోంది. గత మూడు నాలుగు రోజుల్లో మీడియా ద్వారా వెల్లడైన పరిశోధనాత్మక నివేదికల్ని పరిశీలిస్తే కరోనా కేసుల విషయంలో సర్కారు ఎంత గుట్టుగా వ్యవహరిస్తోందో తెలుస్తుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రయివేటు ల్యాబ్స్‌లో చేస్తున్న పరీక్షలు… బులిటెన్ ద్వారా […]
తిరుపతి ఉప ఎన్నిక నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఏయితే ఈ ఉప ఎన్నికలో దొంగ నోట్ల కలకలం రేపింది. దీంతో అధికార పార్టీ పై విపక్షాలు మండిపడుతున్నాయి. YCP ఓటమి భయంతోనే ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. YCPపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏజెంట్లు బెదిరించారని…వలంటీర్ […]
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు అందరూ చూడాలని పేర్కొన్నారు. నేను ఉద్యోగ దీక్ష ఎందుకు చేసానో అందరికి తెలుసని.. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక మానసికంగా రోజు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు చనిపోయేలా చేసింది కేసీఆర్ అని.. కేసీఆర్ ఒక మర్దరర్ […]
ఛత్తీస్ ఘడ్ విషాదం చోటుచేసుంది. రాయపూర్ పచ్పెడీనాకా పరిధిలోని రాజధాని ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 రోగులు దహనం అయ్యారు. ఐసియూలోని ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు.. ఆస్పత్రిలోని కరోనా రోగుల వార్డ్ కు వ్యాపించింది. దీనితో అక్కడి రోగులు పరుగులు పెట్టారు. అటు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం పరిశీలించగా 5 […]
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన […]
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు.. సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు […]
టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. దేశ ప్రజలు మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంటే.. చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని వేయించుకున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. “దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు కాకముందే స్మగ్లర్ల ద్వారా విదేశాల నుంచి టీకాలు తెప్పించుకుని తండ్రి కొడుకులు వేయించుకున్నారని అందరూ అనుకుంటున్నారు. ఎల్లో మీడియా ఫ్రంట్ పేజీల్లో ఫోటోలు కనిపించక […]
ఏపీలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో ప్రతి రోజు 5 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఏకంగా ఆరు వేలకేసులు నమోదయ్యాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే వారం నుంచి ఏపీలో రాత్రి పూట కర్ఫ్యూ ఉండనున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూ పెట్టే ఆలోచన చేస్తోంది జగన్ ప్రభుత్వం. రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తే… కరోనా కేసులను అరికట్టవచ్చని […]
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం…చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిషా రైతులకూ లబ్ది చేకూరుతుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్… ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి […]
తిరుపతి ఉపఎన్నిక ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరిగిన ఈ ఉపఎన్నికలో 25 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో యరపీ ఎన్నికల అధికారికి టిడిపి అధినేత చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ అక్రమాలకు పాల్పడేందుకు ప్రణాళికలు చేసిందని నిఘా పెంచాలని కోరారు. రిగ్గింగ్, హింస ను ప్రేరేపించేందుకు పెద్ద ఎత్తున బయట వ్యక్తులు చొరబడ్డారన్న చంద్రబాబు.. అదనపు బలగాలను దించాలని కోరారు. నకిలీ ఓట్లు పోల్ కాకుండా […]