చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు. అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా “ఎఫ్ 3” సినిమాను తీస్తున్నాడు. అనిల్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ సినిమా షూటింగ్ కి అంతరాయం ఏర్పడింది. కాగా “ఆచార్య” సినిమా షూటింగ్ లో పాల్గొన్న సోనూసూద్ కు నిన్న కరొన సోకిన విషయం తెలిసిందే.