ఎరువుల కొనుగోళ్లు, సరఫరాపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22వ సంవత్సరానికి అవసరమైన ఎరువుల కొనుగోళ్లు, సరఫరాకు విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. ఎరువుల కొనుగోళ్లకు అవసరమైన నిధుల కోసం ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా రుణం తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల కొనుగోళ్లు, సరఫరా, బఫర్ స్టాక్ కోసం రూ. 500 కోట్ల మేర రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మార్క్ […]
ఏపీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలికను మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన కేసులో టిక్‌టాక్ భార్గవ్ ను దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.అయితే అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి వచ్చే నెల మూడో తేదీ వరకు రిమాండ్ విధించారు. అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కు చెందిన భార్గవ్ “ఫన్ బాస్కెట్ ” పేరుతో టిక్ టాక్ వీడియోలు చేసేవాడు. టిక్ టాక్ నిషేధించడంతో మోజో, […]
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ రోజు రాత్రి నుండి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉండనున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. నేటి నుంచి మే 1 వరకు కర్ఫ్యూ కొనసాగునుంది. అత్యవసర సర్వీసులకు నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కర్ఫ్యూ నుంచి మీడియా, […]
విశాఖ టిడిపి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చంద్రబాబుకు తెలుగు ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అచ్చెన్నాయుడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా కష్టాన్ని, శ్రమను నమ్ముకున్న వ్యక్తి చంద్రబాబు అని.. 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడని పేర్కొన్నారు. ఆయన చేయని పదవులు లేవని.. ఉమ్మడి ఏపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. ఎంతో మంది ప్రధానులను, ప్రెసిడెంట్ లను నిర్ణయించిన వ్యక్తి అని.. మళ్లీ చంద్రబాబు సీఎం […]
కెసిఆర్ ప్రభుత్వంపై మరోసారి బీజేపీ నేత విజయశాంతి నిప్పులు చెరిగారు. “తెలంగాణలో కరోనా కట్టడికి సంబంధించి సర్కారుపై సోమవారం హైకోర్టు సంధించిన ప్రశ్నల్ని చూస్తే రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించినట్లు స్పష్టమవుతోంది. టెస్టుల నిర్వహణ, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై గతేడాది కూడా సర్కారు ఇదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. అప్పుడు కూడా హైకోర్టు పలుమార్లు మందలించింది. అయినా తెలంగాణ సర్కారు తీరు మారలేదు. విద్యాసంస్థలను మాత్రం మూయించి సభలు, ర్యాలీలు, వైన్ షాపులు, పబ్‌లు, క్లబ్‌లు, గుంపులు […]
తెలంగాణ ప్రభుత్వంపై హై కోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము అడిగిన వివరాలేవీ ఇవ్వలేదని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడింది హై కోర్టు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదని ఫైర్ అయింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ పై చర్యలు తీసుకోవాలని చెప్పినా ఎందుకు తీసుకోలేదని పేర్కొంది హై కోర్టు. పబ్ లు, బార్లపై క్లబ్ లపై చర్యలు ఏమయ్యాయి ? హై కోర్టు సీరియస్ అయింది. మీకు ఆదాయమే ముఖ్యమా […]
తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్న జార్ఖండ్ నుండి ఛత్తీస్ ఘడ్, తెలంగాణాల మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుండి మరత్వాడా మీదగా ఉత్తర ఇంటీరియర్ కర్నాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిమి ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని […]
తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు పడలేదని…పోలింగ్ 50 శాతమే నమోదయిందని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినట్లు బస్సుల్లో వచ్చి దొంగ ఓట్లు వేసి ఉంటే పోలింగ్ 80-90 శాతం గాని జరిగి ఉండాలి… కానీ అలా ఏమి జరగలేదని తెలిపారు మంత్రి కొడాలి నాని. తిరుపతి ఎన్నికలలో వైసిపి ఖచ్చితంగా గెలుస్తుంది…. 4 లక్షల 50 వేల మెజారిటీతో వైసీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కొడాలి నాని. కరోనా నియంత్రణకు లాక్ […]
కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో ప్రైవేట్ స్కూళ్లు మూతపడడంతో.. ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000లు, కుటుంబానికి 25 కిలోల బియ్యం చొప్పొన అందించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేశారు. అయితే ప్రభుత్వమందించే ఈ ఆపత్కాలపు ఆసరాకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. మొత్తం 1,18,004 […]