ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కు ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. వంశధార నదిపై నేరడి బ్యారేజ్ నిర్మాణం విషయంలో ఒడిషా సహకారం కోరుతూ జగన్ లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణం విషయంలో ఒడిషాతో సంప్రదింపులకు సిద్దమన్న ఏపీ సీఎం…చర్చలకు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ను సమయం కోరారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం వల్ల ఒడిషా రైతులకూ లబ్ది చేకూరుతుందని లేఖలో పేర్కొన్న సీఎం జగన్… ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు, ఒడిషాలోని గజపతి జిల్లా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఏపీ-ఒడిషా రైతులకు ఉపయోగ పడేలా నేరడి బ్యారేజ్ నిర్మాణం ఉంటుందని అభిప్రాయపడ్డ జగన్… సముద్రంలోకి వృధాగా పోయే 80 టీఎంసీల నీటిని నేరడి బ్యారేజీ నిర్మాణం ద్వారా వినియోగంలోకి తేవచ్చని లేఖలో పేర్కొన్నారు.