ఈటల రాజేందర్ బీజేపీలోకి వస్తున్నాడన్న వార్తలతో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో వస్తే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తనను సంప్రదించకుండా ఈటల రాజేందర్ ను ఎలా బీజేపీలోకి ఆహ్వానిస్తారని నిలదీశారు పెద్దిరెడ్డి. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారని..ఆయనతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం శోచనీయమన్నారు.ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లయిట్ లో వచ్చిన నాయకులకు… నాకు […]
ఈటల రాజేందర్ జాయినింగ్ పై బిజెపి రాష్ట్ర నేతల క్లారిటీ ఇచ్చారు. ఈటల చేరికపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడిన బండి సంజయ్.. ఉద్యమకారులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఢిల్లీ పెద్దలకు చెప్పారు. ఉద్యమకారులకు కచ్చితంగా బిజెపి ప్రాధాన్యత, తగిన గౌరవం కూడా ఇస్తుందని బండి సంజయ్ కి చెప్పారు ఢిల్లీ పెద్దలు. ఈటల రాజేందర్ చేరికపై రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్న బండి సంజయ్..ఈటలను బిజెపిలో చేర్చుకోవాలని ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్నిచెప్పారు రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలు. […]
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది. అయితే ఈ కరోనా వల్ల అనేక మంది మృతి చెందుతున్నారు. శ్మశానల వద్ద శవాల గుట్టలు మనుషుల్లో మానవత్వాన్ని కూడా ఇది మంట గలుపుతుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా జల్వార్ గ్రామానికి చెందిన సీమకు కరోనా సోకింది. ఆమెను కోటాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. నెలరోజుల పాటు […]
సమ్మె చేస్తున్న డాక్టర్లతో తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరపాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. డాక్టర్లకు కెసిఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొన్నారు. నోటితో మాట్లాడి …నొసటితో వెక్కిరించి నట్లు సిఎం కెసిఆర్ హామీలు ఉన్నాయని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. మీ అధికారుల్లో చిత్త శుద్ధి లేదు.. చెత్త శుద్ధి ఉందని మండిపడ్డారు. డాక్టర్లు చేస్తున్న న్యాయ బద్ద సమ్మెను పరిష్కరించాలని.. […]
ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మందుపై ఆయుర్వేద కౌన్సిల్ లో ఆనందయ్య రిజిస్టర్ చేసుకోలేదని పేర్కొంది ప్రభుత్వం. ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్న ప్రభుత్వం… ల్యాబ్ ల నుంచి ఈ నెల 29న రిపోర్ట్స్ వస్తాయని వెల్లడించింది. ప్రజలు మందు కావాలని కోరుతున్నారని, ఎదురు చూస్తున్నారని వీలైనంత త్వరగా రిపోర్టులు రావాలని హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మందు పంపిణీ ఆపాలని లోకాయుక్త ఎలా ఆదేశాలు ఇస్తుందన్న పిటిషనర్ న్యాయవాది.. ఆనందయ్యతో ప్రైవేట్ […]
స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సొంతూరు దగ్గరలో ఉన్న రాజోలులో 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం సుకుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన డైరెక్టర్ సుకుమార్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ అభినందించారు. బుధవారం సాయంత్రం సుకుమార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా […]
ఏపీలో కరోనా విలయం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు తెలిపింది ఏపీ ప్రభుత్వం. పదో తరగతి పరీక్షలు ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తర్వాత నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తూ […]
పోలవరం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి స్దాయిలో సిద్దం చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద… గోదావరికి అడ్డుకట్ట వేయడం ఇంజనీరింగ్ అద్భుతం అంటున్నారు నిపుణులు. గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపు పనులు మొదలు కాగా.. గోదావరి నదీ ప్రవాహాన్ని ఎడమవైపు నుండి కుడివైపుకు మళ్ళిస్తున్నారు అధికారులు. అప్రోచ్ ఛానెల్ నుండి స్పిల్ వే మీదుగా స్పిల్ ఛానెల్ నుండి […]
ఇవాళ టిడిపి మహానాడు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మహానాడు కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతారు..? అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుంది. టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైంది. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావ్ బాబూ? కుప్పంలో ఎందుకు ఖంగుతిన్నావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో […]
ఈటల రాజేందర్ తో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ భేటీ అయ్యారు. ఈటల రాజేందర్ బిజేపిలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ ఈటల నివాసంలో ఆయనతో సమావేశం అయ్యారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణతో పాటు నిర్ణయంపై చర్చించినట్లు సమాచారం. ఈటల బిజేపిలో చేరుతున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది. సిఎం కెసిఆర్ వ్యతిరేక శక్తుల మద్దతు కూడగట్టే యోచనలో […]