భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,65,553 పాజిటివ్ కేసులు నమోదవగా.. 3,460 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2,76,309 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,25,972 మంది మరణించారు.. ఇక, రికవరీ కేసులు 2,54,54,320 కు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 21,14,508 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక అటు ఇప్పటి వరకు 21,20,66,614 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయింది.