ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు టీకా సేకరణ, డ్రైవర్లకు వ్యాక్సినేషన్ పై ఆర్ధిక శాఖామాత్యులు హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 2021 జూన్ 3వ తేదీ నుండి రాష్ట్రంలోని అందరు ఆర్టీసీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరియు మాక్సి క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సిన్ అందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జి.హెచ్.ఎం.సి ప్రాంతంతో పాటు ఇతర జిల్లా ప్రధాన కేంద్రాలతో కలిపి రోజుకు […]
ఏపీ ప్రభుత్వంపై ఆనందయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రభుత్వం పూర్తిగా సహకరించి త్వరగా అనుమతులు ఇప్పించిందని.. ప్రభుత్వ సహకారం పూర్తిగా తనకు ఉందని ఆనందయ్య పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతోనే మందు పంపిణీ చేస్తానని.. మూడు రోజుల్లో తమ కుటుంబ సభ్యులు, అధికారులతో చర్చించి ముందు ఎప్పుడు పంపిణీ చేసిందో వెల్లడిస్తానని తెలిపారు. పోలీసులు నిర్బంధించలేదని, రక్షణ కల్పించారని..ఉన్నవాళ్ళకి కాదు లేని వాళ్లకు కూడా మందు పంపిణీ చేశానన్నారు. మందుకు కావలసిన వనమూలికలు సమృద్ధిగా ఉన్నాయని..ఇప్పటి వరకు […]
‘గల్లీ బాయ్’ సినిమాతో తన డిఫరెంట్ టేస్ట్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంది జోయా అఖ్తర్. వెటరన్ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ కూతురుగా మెగాఫోన్ పట్టుకున్న మిస్ జోయా క్రమంగా తన సత్తా చాటుతూ వస్తోంది. ‘జిందగీ నా మిలేగి దుబారా, దిల్ ధడక్ నే దో’ లాంటి చిత్రాలతో యూత్ ను తెగ ఆకట్టుకోగలిగింది. ఆమె తాజాగా మరో సినిమాకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి కంప్లీట్ యూత్ ఫుల్ కాంబినేషన్ కు తెర తీసింది… […]
సినిమా ఇండస్ట్రీ అంటే కళలు, కలలు మాత్రమే కాదు… కాంపిటీషన్ కూడా! నిజానికి గ్లామర్ ప్రపంచంలో అందరికంటే, అన్నిటికంటే ఉధృతమైనది పోటీనే! ఆ పోటీకి తట్టుకోలేకే చాలా మంది కొట్టుకుపోతుంటారు. అయిదేళ్లో, పదేళ్లో లైమ్ లైట్ లో నిలిస్తే అదే గొప్ప! ఇక పదేళ్ల తరువాత ఎన్ని ఎక్కువ సంవత్సరాలు సత్తా చాటితే అంతగా లెజెండ్స్ అయిపోతుంటారు సినిమా సెలబ్రిటీలు! మరి ఒక వ్యక్తి ఏకంగా 52 ఏళ్లు… అంటే, అర్థ శతాబ్దానికంటే ఎక్కువగా… దేశం మొత్తాన్ని […]
బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా […]
ఈ మధ్య కాలంలో కరణ్ జోహర్ అంటే అదో కాంట్రవర్సియల్ నేమ్ గా మారిపోయింది. మొదట కంగనా నెపోటిజమ్ కామెంట్స్, ఆ తరువాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో, బాలీవుడ్ మాఫియా అంటూ ఆరోపణలు… ఇలా పుట్టెడు చిక్కుల్లో ఉన్నాడు కేజో. కానీ, ఆయన నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా బోల్డ్ థింకింగ్ మాత్రం కాదనలేనిది! ‘కాఫీ విత్ కరణ్’ అంటూ టాక్ షో నిర్వహించి రకరకాల చర్చలకు, వివాదాలకు కారణం అవుతుంటాడు కరణ్. కానీ, […]
ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయాల్సి ఉంది. కానీ దానికి మరికాస్తంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత కొరటాల శివ యంగ్ టైగర్ ఎన్టీయార్ తో మూవీ చేస్తానని మాటిచ్చారు. సో… ఆ తర్వాతే బన్నీ – కొరటాల శివ మూవీ ఉంటుంది. సో… ఈ లోగా వేరే దర్శకులతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ […]
గత యేడాది విడుదల కావాల్సిన నితిన్ చిత్రాలు కరోనా కారణంగా థియేటర్లు క్లోజ్ కావడంతో ఈ యేడాది విడుదలయ్యాయి. అలా ‘చెక్’తో పాటు ‘రంగ్ దే’ చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ అయ్యియి. కానీ వాటికి ఆశించిన స్థాయి విజయం మాత్రం దక్కలేదు. ఇదిలా ఉంటే… ప్రస్తుతం సెట్స్ పై ఉన్న నితిన్ ‘మాస్ట్రో’ చిత్రం మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెన్స్ కనిపిస్తున్నాయి. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది […]
అజయ్ దేవగణ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘మేడే’. థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమా చాలా భాగం హైద్రాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంది. ఫిల్మ్ సిటీలో బిగ్ బి, రకుల్ ప్రీత్ సింగ్ సహా ఇతర నటీనటులు పాల్గొన్న షెడ్యూల్ ఇప్పటికే పూర్తైంది. అయితే, లాక్ డౌన్ కారణంగా అజయ్ దేవగణ్ ఇతర సినిమాల మాదిరిగానే ‘మేడే’ కూడా సందిగ్ధంలో పడింది. అజయ్ నటించిన ‘భుజ్’, ‘మైదాన్’ సినిమాలు కూడా జనం ముందుకు రావాల్సి ఉంది. […]
తెలంగాణలో లాక్‌డౌన్‌ను పోడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ను మరో 10 రోజులు పొడిగిస్తూ కెసిఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 15వ తేదీ వరకు వేసవి సెలవులను పొడిగిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డైట్ కాలేజీలకు కూడా 15 వరకు సెలవులు పొడిగించారు. ఇక తెలంగాణలో ఏప్రిల్ 27 నుంచి మే నెల […]