పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మార్చి చివర్లో సుళ్య పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు […]
రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా […]
సిఎం కెసిఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు, నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. లక్షలాది మంది యువతీ, […]
కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాలలో ఆన్‌లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామని వివరించారు. Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ పోర్టల్ లో ఆన్‌లైన్ […]
కరోనా బాధితుల కోసం మినిస్టర్ ఆఫ్ ఆయుష్షు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసిన ఆయుష్షు 64 మెడిసిన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. గతంలో మలేరియా కోసం వాడిని ఈ డ్రగ్ ను కరోనా రోగులపై క్లినికల్ ట్రయల్స్ జరుపనుంది. 18 నుండి 60 మధ్య సంవత్సరాల వయస్సు వారిపైన క్లినికల్ ట్రయల్స్ చేయనుంది నేషనల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూనినాని. ఆసింటమేటిక్, మైల్డ్ సింటమ్స్ ఉన్న కరోనా బాధితులను అధికారులు […]
ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో తమ్మినేని సీతారాంకు చికిత్స కొనసాగుతోంది. గత రెండు రోజులుగా ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అనారోగ్యంగా ఉండటంతో ఇంట్లోనే వైద్యం తీసుకున్న ఆయన.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆస్పత్రిలో చేరారు. అయితే తమ్మినేని సీతారాం ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆళ్లనాని స్పందించారు. మణిపాల్ ఆస్పత్రికి ఫోన్ చేసి ఆయన […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం టిడిపికి ఎందుకు పట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. “రెండేళ్లలో జగన్ గారు ఏం చేయక పోతే 20 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పచ్చపార్టీ అడ్రసు లేకుండా ఎందుకు పోతుంది? పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకని దరిద్రం ఎందుకు పట్టుకుంటుంది. వచ్చే మూడేళ్లలో యువ సిఎం నాయకత్వంలో ఇంకా అద్భుతాలు జరుగుతాయి.” […]
మంత్రి కేటీఆర్, బాలీ వుడ్ స్టార్ సోనూ సూద్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. కరోనా నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రజల సమస్యలను తీరుస్తున్నారు. సోనూ సూద్ అయితే..కరోనా బాధితులు ఏ మూల నుంచి సహాయం కోరినా.. ఇట్టే చేసేస్తున్నాడు. ఇటు కేటీఆర్.. తెలంగాణ ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల వారికి అపన్నహస్తంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరి మధ్యనే సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్ […]
ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ […]