ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, హైరిస్క్ గ్రూపులకు చెందిన ఆటో, క్యాబ్, మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు జి.హెచ్.యం.సి పరిధిలో 10 సెంటర్ల ద్వారా 20 రోజుల పాటు స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో బాగంగా 2 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ ను అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. High exposure గ్రూపులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ ను చేపట్టామన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం క్యాబ్, ఆటో, వ్యాక్సినేషన్ సెంటర్ ను తనిఖీచేశారు. […]
ఆనందయ్య ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం. రోజుకి 15 నుంచి 20 […]
ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్ గ్రామాలకు చెందిన రైతుల భూములపై మంత్రి ఈటల కబ్జా పెట్టారనే ఆరోపణలు తెలంగాణ రాజకీయాలను కుదిపేశాయి. కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ మంత్రి పదవి పోయింది.. దీంతో.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికపై తర్జనభర్జన పడిన టీఆర్ఎస్ సీనియర్ నేత.. అన్ని పార్టీల నేతలతో చర్చలు జరిపారు.. చివరకు భారతీయ జనతా పార్టీ వైపే ఆయన […]
సీఎం జగన్ పేదలందరికీ ఇళ్లు ఉండాలని 30 లక్షల మందికి ఇళ్లస్థలాలు ఇచ్చారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. వాటిలో ఇళ్ల నిర్మాణంకు సిఎం జగన్ శంకుస్థాపన చేశారని..ఆ కాలనీలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించనున్నారని వెల్లడించారు. కేంద్రం ఇంటి నిర్మాణానికి నిధులు కల్పిస్తుందని…భూ కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రం చేస్తోందన్నారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ ను తక్కువ ధరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించే చర్యలు తీసుకుందని తెలిపారు. సిఎం జగన్ అభిమతం అన్ని ప్రాంతాలను […]
స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంకులు విడుదల చేసింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది. 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఏపీ. 75 స్కోర్ తో […]
కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డిపై మరోసారి విహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపిని నాశనం చేసి.. కాంగ్రెస్ లోకి వచ్చాడని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఇతర పార్టీ ల నుండి వచ్చిన వాళ్లకు పిసిసి ఇస్తా అంటే ఎలా.. పిసిసి అయ్యాక రేవంత్ జైల్ కి పోతే..పార్టీ జైలు చుట్టూ తిరగాలా? అని ఫైర్ అయ్యారు. ఇప్పటి వరకు తనను తిట్టిన వాళ్ళు లేరు..మూడు,నాలుగు పార్టీలు మారిన వాళ్ళు తిడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి మీద […]
దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కరోనా వ్యాక్సిన్ కోసం భారీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మూడో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకా కోసం 1500 కోట్ల రూపాయల మేర ముందస్తు డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఆగస్ట్ – డిసెంబర్ మధ్య 30 […]
విశాఖ విమ్స్ లో మరో దారుణం చోటు చేసుకుంది. గొల్ల పాలెం భీమినిపట్నంకు చెందిన ఎమ్. వేణు బాబు (37) అనే వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. కోవిడ్ తో ఈ నెల 1న విమ్స్ హాస్పిటల్ లో చేరిన వేణు బాబు..ఆత్మస్తైర్యం కోల్పోయి విమ్స్ హాస్పిటల్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికంగా ఈ ఘటన కలవరం రేపుతోంది. ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు వేణు బాబు. హాస్పిటల్స్ లో వరుసగా […]
బిజేపిలోకి ఈటల వస్తున్నాడన్న వార్తతో పార్టీలో నూతన ఉత్సాహం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈటల చేరికపై ఫుల్ బిజీగా ఉన్న తెలంగాణ బిజేపికి షాక్ తగిలింది. పెద్దపల్లి బిజేపిలో ముసలం నెలకొంది. మాజీ ఎంపీ వివేక్ పై అసంతృప్తి నేతలు తిరుగుబాటుకు దిగారు. ఈ రోజు మంచిర్యాలలో అసమ్మతి నేతలు సమావేశం కానున్నారు. వివేక్ తీరుపై మాజీ మంత్రి బోడ జనార్ధన్, మాజీ ఎమ్యెల్యేలు గుజ్జుల రామకృష్ణ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తదితర నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు […]
ఈ మధ్య కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ లతో ఫోన్లు చేసి మరీ.. డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేటుగాళ్లు మామూలు ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు, పోలీసులకు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ అనే వ్యక్తి చుక్కలు చూపెడుతున్నాడు. నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ.. వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫారీ కాద్రీ. ఇందులో […]