కరోనా సమయంలో లాక్‌డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్ళటానికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్ లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాలలో ఆన్‌లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామని వివరించారు. Tapp Folio మొబైల్ యాప్, https://ts.meeseva.telangana.gov.in/meeseva/home.htm మీ సేవ పోర్టల్ లో ఆన్‌లైన్ పూజలను బుక్ చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ పూజలు నిర్వహించే ఆలయాల జాబితాలో 38 ప్రధాన ఆలయాలు ఉన్నాయని, వాటిలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంతోపాటు పలు దేవాలయాల్లో ఆన్ లైన్ పూజలు జరిపిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయానికి నేరుగా వెళ్ళి దర్శనం చేసుకోలేని భక్తుల సౌకర్యార్ధం ఆన్ లైన్ లో అర్చనలు, పూజలు చేయించుకునే అవకాశం కల్పించామని, లాక్‌డౌన్ సమయంలో ఈ సేవలను విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు.