పరిపాలనా సౌలభ్యం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో నాలుగో జేసీ పోస్టును మంజూరు చేసింది ప్రభుత్వం. జాయింట్ కలెక్టర్-హౌసింగ్ పేరుతో మరో జేసీ పోస్టుని ఏర్పాటు చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం ఇప్పటికే జిల్లాల్లో ముగ్గురు జేసీల ఏర్పాటు చేసిన సర్కార్.. జేసీ-హౌసింగ్ పోస్టును ఐఏఎస్ కేడర్ అధికారితో భర్తీ చేయాలని ఆదేశించింది.జేసీ-హౌసింగ్ పరిధిలో ఇంధన, గ్రామీణ మంచి నీటి సరఫరా, పారిశుద్ధ్యం, పంచాయతీ రాజ్, పట్టణాభివృద్ధి, ఏపీ ఫైబర్ నెట్, […]
తెలుగు రాష్ట్రాలకు రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నం తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ ఋతుపవనాలు కర్యలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో తెలుగు రాష్ట్రాలలో రాగల రెండు రోజులు […]
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) మృతి చెందారు. ఈ ఘటన కాసేపటి క్రితమే జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. తాగుడు అలవాటును తప్పించడానికి రవీంద్రను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు చేర్పించారు. కానీ వైద్యానికి నిరాకరించిన రవీంద్ర.. ఆసుపత్రి నుంచి తప్పించుకుని ఓ హోటల్ లో ఉన్నాడు. అయితే.. ఆయన ఆరోగ్యం క్షీణించి.. బ్లడ్ […]
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. తాజాగా రేపు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర చేయనున్నారు. ఉదయం 6 గంటలకు లోటస్ పాండ్ నుంచి బయలుదేరనున్న షర్మిల..మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎల్దుర్తి మండలంలోని అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉద్యోగం రావట్లేదని […]
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ అవతరణ దినోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాల తో పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో దేశం గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల అనతి కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను వొక్కొక్కటిగా అమలు చేస్తున్నదన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం, […]
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే తొలిసారి చైనాలో ఓ మనిషికి బర్డ్ ఫ్లూ సోకింది. చైనా తూర్పు ప్రావిన్స్ లోని జెన్ జియాంగ్ నగరానికి చెందిన 41 ఏళ్ల ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకిందని ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ […]
కోవిడ్ వైద్యంలో కీలకమైన ఆక్సీజన్ కాన్సట్రేటర్స్ ను ఏపీ ప్రభుత్వానికి విరాళంగా అందించింది అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా). సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు ఆటా ప్రతినిధులు. ప్రాథమికంగా 50 కాన్సట్రేటర్స్ ను ప్రభుత్వానికి అందించిన ఆటా.. మొత్తం 600 కాన్సట్రేటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ సందర్బంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని..ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆటా సాయంగా నిలిచిందన్నారు. వేల కిలోమీటర్ల దూరంలో […]
ఆనందయ్య మందుపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు తయారీ, పంపిణీ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదికలో ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ మందు వాడటం వల్ల కరోనా తగ్గుతుందని నిర్థారణ కూడా కాలేదని పేర్కొందని..కరోనా సమయంలో ఆనందయ్య మందు తయారు చేసి మా వంతు సహాయం చేయాలని అనుకున్నామన్నారు. కేంద్ర సంస్థ నివేదికల తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నామని..ఎవరి […]