చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఉదృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 వ తరగతి పరీక్షలను […]
మందు పంపిణీపై ఎట్టకేలకు ఆనందయ్య స్పందించారు. కొంత ఇబ్బంది ఉన్న మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని..మొదట నియోజకవర్గంలో ఇచ్చి తర్వాత ఇతర ప్రాంతాలకు ఇద్దామని ఎమ్మెల్యేతో తానే చెప్పానని పేర్కొన్నారు. పంపిణీపై సోమిరెడ్డి మాట్లాడాల్సిన అవసరం లేదని..సోమిరెడ్డి మాట్లాడింది అవాస్తవమని విమర్శలు చేశారు. మీ సొంత గొడవలోకి తనను లాగవద్దన్నారు. తనను ప్రజాసేవ కోసం ఉపయోగించుకోవాలని..రాజకీయాల్లోకి లాగొద్దని మండిపడ్డారు. సోమవారం నుంచి ముందు పంపిణీ జరుగుతుందని… ఏవైనా పెద్ద ఆటంకాలు వస్తే తప్ప.. పంపిణీ […]
ఆనందయ్య మందు పంపిణీ చాలా గందరగోళంగా తయారైంది. Childeal.com ద్వారా ఆనందయ్య ఆయుర్వేదం మందును పంపిణీ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం చేసింది. అలాంటి అధికారిక వెబ్‌సైట్ ఏదీ లేదని తేల్చిచెప్పింది ఫ్యాక్ట్ చెక్ టీమ్. ఇప్పటి వరకు ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించింది. ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే ప్రభుత్వమే అధికారికంగా వెల్లడిస్తుందని […]
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో విద్యార్థుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. జూన్ మొదటి వారంలో రివ్యూ చేసి నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన సర్కార్.. లాక్ డౌన్ ముగియగానే ఇంటర్ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని ఇప్పుడు అంటోంది. ఇతర రాష్ట్రాల్లో 12వ తరగతి పరీక్షలు, ఫలితాలపై ఏ నిర్ణయం తీసుకున్నారో వివరాలు తెప్పిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. జులై రెండో వారంలో పరీక్ష సమయం తగ్గించి పరీక్షలు నిర్వహిస్తామని […]
మీడియాలో వార్తలు వ్యాఖ్యల ద్వారా తమ వృత్తిధర్మం నిర్వహించే పాత్రికేయులకు రక్షణ వుండాలని సీనియర్ జర్నలిస్టు వినోద్‌దువా కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరూ ఆహ్వానించారు. మీడియా ప్రసారాలు ప్రచురణలపై 124(ఎ) రాజద్రోహం కేసులు మోపడంసరికాదని పేర్కొంది. పౌరులకు కూడా ప్రభుత్వాల లోపాలను వైఫల్యాలను సమస్యలను విమర్శించే హక్కు వుంటుందని కూడా ఆ తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పుల్వామాలో ఉగ్రవాదుల వేటుకు, బాల్‌కోట వైమానిక దాడికి ఇచ్చిన ఉద్వేగ ప్రచారం ఇప్పుడు కరోనా […]
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి రాజ్ భవన్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ గారు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని యువకుడు రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి […]
లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,38,182 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2070 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,89,734 కరోనా కేసులు, 3364 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,762 […]
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాదు ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. […]
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టినట్లు కనిపిస్తోంది. నిన్నటి కంటే ఇవాళ కరోనా కేసులు తగ్గాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 10,373 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,49,363కు చేరింది. ఇందులో 16,09,879 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,28,108 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. […]