టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. […]
కాంగ్రెస్ ఎమ్యెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఠాగూర్ తన పైన చిన్న చూపు చూస్తున్నారని.. తెలంగాణలో బలమైన నాయకుడిగా ఠాగూర్ నన్ను గుర్తించకపోవడం నా దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. నేను పీసీసీ అడుగుతున్నా.. ఢిల్లీ చర్చలో తన పేరు లేకపోవడం దురదృష్టమన్నారు. ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే బాంబే హైవే మీద కేసీఆర్ ను అడ్డగించిన చరిత్ర తనది అని.. ఇది ఠాగూర్ కు తెలువక […]
తెలంగాణలో కొత్త పార్టీతో వస్తున్నానని వైయస్ షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. సిఎం కెసిఆరే టార్గెట్ గా షర్మిల పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో నేరుగా సీఎం కేసీఆర్‌ను, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా తెలంగాణ వైయస్సార్ అభిమానులకు వైఎస్ షర్మిల గుడ్ న్యూస్ చెప్పారు. వైఎస్ఆర్ కార్యకర్తలు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న షర్మిల పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు వైఎస్ షర్మిల లోటస్ పాండ్ […]
మంత్రి కేటీఆర్ పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు కప్పి పుచ్చుకోవడానికి…నిర్లక్ష్యాన్ని కేంద్రంపై మోపుతున్నారని… కేటీఆర్ కళ్లు ఉన్నోడు అయితే ఇలాంటి విషం చిమ్మడని మండిపడ్డారు. ప్రజల జీవితాలతో రాజకీయాలు చేసే కుళ్లు మనస్తత్వం కేటీఆర్ ది అని.. భారత్ బయోటెక్ ను వాళ్ళు విజిట్ చేశారా.. అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసారా? అని నిలదీశారు. ట్విటర్ పిట్ట కేటీఆర్.. ట్విట్టర్ మంత్రిగా మారిపోయారు… హైటెక్ మంత్రిగా గొప్పలు చెప్పుకుంటున్నాడని.. […]
ఏపీ సిఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ వల్ల సిఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలని భావించినా.. జగన్ మాత్రం పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం రోజున సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్ళి.. […]
వాక్సినేషన్ కార్యక్రమంపైన ప్రజల నుంచి సలహాలను, సూచనలను మంత్రి కే తారకరామారావు ఈ రోజు స్వీకరించారు. ఆస్క్ కేటీఆర్ పేరుతో కోనసాగిన ట్విట్టర్ సంభాషణలో మంత్రి పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తు, ప్రజల నుంచి వచ్చిన విలువైన సలహాలు పైన సూచనలు పైన స్పందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించిన పలు అంశాలను ప్రజలకు వివరించారు. తెలంగాణలో వ్యాక్సినేషన్ పక్రియ ముమ్మరంగా కొనసాగుతున్నదని, ఓల్డ్ ఏజ్ హోమ్ ల్లోనూ వాక్సినేషన్ […]
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు ఈరోజు తన పుట్టినరోజును పురస్కరించుకుని మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎం.పీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇదేవిధంగా మొక్కలు నాటాలని తన […]
లాక్‌డౌన్ ప్రభావం తెలంగాణపై స్పష్టంగా కనిపిస్తోంది. లాక్‌డౌన్ వల్ల తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97,751 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1436 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 5,91,170 కరోనా కేసులు, 3378 మరణాలు నమోదు అయ్యాయి. ఇదే సమయంలో.. 3,614 […]
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటలను రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చూసుకున్నారన్నారని..బీజేపీ మత తత్వ, రెచ్చగొట్టే, విభజించి పాలించే పార్టీ అని అన్నారు. హుజురాబాద్ లో TRS పార్టీ కార్యాలయంలో రజక కుల సంఘం నాయకులతో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితేల సతీశ్ కుమార్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కష్టపడి గెలిపించిన టీఆర్ఎస్ నాయకులను […]
ఇంస్టాగ్రామ్ లో ప్రేమించిన యువతి కోసం ఓ యువకుడు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేశాడు. బీర్ బాటిల్ తలపై మోదుకుంటూ మరీ బెదిరింపులకు దిగిన ఘటన వికారాబాద్ జిల్లా దోమ పొలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. దోమ మండలం ఖమ్మం నాచారం గ్రామానికి చెందిన వినోద్ (18) అనే యువకుడుకి గజ్వెల్ కు చెందిన (20) ఏళ్ల యువతీ ఇంస్టాగ్రామ్ లో పరిచయం అయింది. అయితే ఈ పరిచయం కాస్త..వారి ఇద్దరి […]