తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో పని చేస్తున్న అధికారులకు, సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి వ్యాక్సినేషన్ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శనివారం వివిధ బ్యాంకుల ప్రతినిధులతో బ్యాంక్ అధికారులు, సిబ్బంది వ్యాక్సినేషన్ పై బి.ఆర్.కె.ఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి […]
ఈటల రాజేందర్ పై టీఎంయు జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈటల ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్సీ కవితపై విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని..మరొకసారి ఆర్టీసీ గురించి గాని, కవిత గురించి మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు. కవితను టీఎంయు అధ్యక్షురాలుగా ఉండాలని మేము కోరాము, మా అధిష్టానం ఒప్పుకుంటే మీ ప్రతిపాదనను అంగీకరిస్తానని కల్వకుంట్ల కవిత అన్నారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీని రక్షిస్తున్నారని…ఆర్టీసీని అదుకున్నది కేసీఆరే అని పేర్కొన్నారు. ఆర్టీసీపై […]
మనషులు, జంతువుల మధ్య బంధం గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ అనుబంధం చాలా గొప్పది, విడదీయలేనిది. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. చనిపోయిన తన మావటిని కడసారి చూసేందుకు గజరాజు తరలివచ్చిన దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. విగతజీవుడిలా పడివున్న ఆ మావటిని పిలుస్తున్నట్టుగా తొండం పైకెత్తి పలుమార్లు ఆ ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.ఆ మావటి కుటుంబ […]
కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఓ మహిళా మృతి చెందింది. అంతేకాదు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్ లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 16 మందికి తీవ్ర […]
నైరుతి ఋతుపవనాలు ఈ రోజు కర్ణాటక తీరం, గోవా అంతటా మరియు మహారాష్ట్రలో కొంత భాగం, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటకలో చాలా భాగం, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో కొంత భాగం (నైరుతి జిల్లాలలోకి) తమిళనాడులో చాలా భాగంలోకి ప్రవేశించాయి. రాగల 24 గంటలలో తెలంగాణా రాష్ట్రంలో చాలా భాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు నైరుతి దిశగా తెలంగాణ రాష్ట్రంలోకి వస్తున్నాయి. రాగల 3 రోజులు (05,06,07వ తేదీలు) తేలికపాటి […]
టిడిపి అధినేత చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని.. వారు కరువుకు మారు పేరు అని చురకలు అంటించారు. “తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో ఉండబట్టే ఈసారి ముందే వర్షాలు వచ్చాయని అంతా అనుకుంటున్నారు. కరువుకు మారు పేరుగా మారిన నారా వారు ఇంకో 4 నెలలు అడుగు పెట్టకుండా ఉంటే రుతుపవనాలు వర్షాలను కుమ్మరిస్తాయి. గడచిన రెండేళ్లలాగే ఈ […]
మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్ళటం టిఆర్ఎస్ కే నష్టమని.. టిఆర్ఎస్ లో అసలైన తెలంగాణ వాదులు ఆరుగురే ఉన్నారని పేర్కొన్నారు. ఈటెల బిజెపిలోకి వెళ్తే కేసీఆర్ కే నష్టమని.. మరో పశ్చిమ బెంగాల్ లా… తెలంగాణ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. జార్ఖండ్ సీఎం.. కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తే … సీఎం జగన్ ఎందుకు అడ్డు చెప్పారని..ఇప్పుడు ఎందుకు కేంద్రానికి […]
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను […]
బిజెపిలో ఈటెల చేరికపై అన్ని పార్టీలు స్పందిస్తుతున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ లు స్పందించగా తాజాగా బిజేపి నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈటల బీజేపీలో చేరతానంటే ఎందుకు ఇంత ఆగమైతున్నారని మండిపడ్డారు. “సీఎంఓలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు లేరన్న ఈటల గారి ప్రకటనపై ముందుగా ఎందుకు చెప్పలే…. అని టీఆరెస్ ప్రతి విమర్శలు చేసే బదులు, వెంటనే నియామకం చెయ్యవచ్చు. సమర్థులైన ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు ఉన్నారు కదా? సీఎం […]