చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఉదృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పరీక్షల కంటే విద్యార్ధుల జీవితాలు ముఖ్యమైనవని, 12 వ తరగతి పరీక్షలను రద్ధు చేయాలని తమిళనాడు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.