వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష కార్యక్రమంపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. జూన్ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తికావాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునే విధానంలో ముందుకు సాగాలని… అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన మేరకు డ్రోన్లు కొనుగోలు చేయాలని… అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను తీసుకోవాలని తెలిపారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని…ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సమగ్ర సర్వే పై సమీక్ష చేస్తానన్నారు. అలాగే స్పందనలో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్షచేస్తానని…వారానికి ఒకసారి మంత్రుల కమిటీ సమీక్ష చేయాలని వెల్లడించారు. సమగ్ర సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని…సర్వే ఆఫ్ ఇండియా సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించారు.