తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువతకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమంతో పాటు తెలంగాణ స్వయం పాలనలో యువత పాత్ర గొప్పదని సీఎం అన్నారు. తెలంగాణ ఏర్పాటుతో రాజకీయ, పాలనా రంగాల్లో విద్యార్థి యువనేతలకు చట్టసభల్లో పెద్దఎత్తున అవకాశాలు కల్పించి బడుగు బలహీన వర్గాల యువతను ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ ప్రక్రియ మునుముందు కూడా కొనసాగుతుందని తెలిపారు.
యువత భవిష్యత్తును దృష్టిలో వుంచుకుని వారి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు మరింతగా మెరుగుపడే దిశగా వ్యవసాయం, పరిశ్రమలు, ఐటి వంటి రంగాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని సీఎం అన్నారు. ఉపాధికి అవకాశమున్న టూరిజం, లాజిస్టిక్స్ వంటి వినూత్న మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నదన్నారు. స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం పలు పథకాల ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తున్నదన్నారు.
Also Read
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
శాస్త్రీయ పద్ధతిలో జోనల్ విధానాన్ని అమలులోకి తెచ్చుకుని ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు మార్గం విస్తృతం చేసుకున్నామన్నారు. వినూత్న పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా యువత ఉపాధికి బాటలు మెరుగవుతున్నాయని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణ లో యువత పాత్ర అన్ని రంగాల్లో మరింత కీలకం కాబోతున్నదన్నారు. భవిష్యత్ తెలంగాణ యువతదేనని సీఎం తెలిపారు.
తాజావార్తలు
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!