తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి చామకూర మల్లారెడ్డి పై కాంగ్రెస్ నేతలు మరియు కార్యకర్తలు భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యం లోనే బోయినిపల్లి లో ఉన్న మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు దళిత కాంగ్రెస్ నాయకులు. దళిత కాంగ్రెస్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే.. ఈ ముట్టడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో దళిత కాంగ్రెస్ నాయకులు మరియు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యం లో మంత్రి చామకూర మల్లారెడ్డి ఇంటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే… కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం బోయిన్ పల్లి లోని మంత్రి మల్లారెడ్డి నివాసానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.