ప్రకాశం : స్కూల్స్ లో విద్యార్దుల హాజరుశాతం గణనీయంగా పెరుగుతుందని.. 74 శాతం విద్యార్థులు స్కూల్స్ కు వస్తున్నారని ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శ్రీకాకుళంలో 83శాతం హాజరుశాతం నమోద అయ్యారని… కొన్ని చోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. స్కూల్స్ లో కరోనా భయంతో తల్లితండ్రులు ఆందోళన చెందుతున్న మాట వాస్తవమేనని… ప్రభుత్వం తల్లిదండ్రుల ఆందోళనను గుర్తించిందని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా పాఠశాలలు నడపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 95 శాతం మంది ఉపాధ్యాయులకు వాక్సినేషన్ పూర్తయ్యిందని వివరించారు. పాఠశాలలో శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.