తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 230 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,59, 543 కి చేరింది. ఇందులో 6,50,114 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,545 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 3884 కి చేరింది. ఇక తెలంగాణలో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేయడమే కాకుండా నిబంధనలు పాటిస్తుండటంతో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 357 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.