అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి భేటీ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 12.30 కు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి.. కాసేపటి క్రితమే ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు సుబ్రహ్మణ్య స్వామి. ఆధ్యాత్మిక క్షేత్రం టీటీడీ విషయం లో సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలను గతంలో ప్రశంసించిన సుబ్రహ్మణ్యం […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నిన్నటి వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి ఆంధ్ర ప్రదేశ్ నుండి దూరంగా వెళ్లిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు పేర్కొంది. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :ఈరోజు, రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో […]
తెలంగాణ రాష్ట్రంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చుకున్నామని… త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మహిళ సంఘాలకు రెండు కోట్ల 13లక్షల 48వేల వడ్డి లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని.. బతుకమ్మ […]
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భ్రుతిపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు బండి సంజయ్ కుమార్. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలపై శ్వేత పత్రం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు, నిరుద్యోగ భ్రుతిపై విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్ష […]
ఆ ఎమ్మెల్యే అమరావతి టూర్ సక్సెస్ అయిందా? నామినేటెడ్ పోస్ట్ వ్యవహారంలో ఇబ్బంది పడి.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? పార్టీ పెద్దలతో మాట్లాడి పంతం నెగ్గించుకున్నారా? పదవి పొందిన నాయకుడి ప్రమాణ స్వీకారం ఆగిందా… ఆపారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఆయనకొచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరికీ టచ్‌లోకి రానని ప్రకటించిన ఎమ్మెల్యే! చిత్తూరు జిల్లాలో కొన్ని నామినేటేడ్ పదవులు స్థానికేతరులకు ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల ట్రస్ట్ బోర్డ్ పదవుల భర్తీ.. […]
ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల మధ్య అస్సలు పడటం లేదు. ఆ ప్రభావం పార్టీ కమిటీలపైనా పడింది. మరోసారి ఆధిపత్య పోరుకు దారితీసింది. ఒక నియోజకవర్గం.. రెండు కమిటీలుగా పరిస్థితి మారిపోయింది. ఎక్కడో ఏంటో.. లెట్స్ వాచ్! తాండూరులో ఎవరి కమిటీ వారిదే..! వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు మరోసారి వార్తల్లో నిలిచారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం గ్రామ, వార్డు, మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధిష్ఠానం నేతలందర్ని ఆదేశించింది. ఇప్పుడు […]
ఏపీలో టీడీపీ సీనియర్ల కామెంట్స్ పార్టీలో కలకలం రేపుతున్నాయా? వారి వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయా? రచ్చరచ్చ అవుతోందా? నేతల స్టేట్‌మెంట్స్ తెలుగుదేశాన్ని మరోసారి గందరగోళంలో పడేస్తున్నాయా? సీనియర్ల ప్రకటనల వెనక ఉన్న మర్మం ఏంటి? టీడీపీలో సీనియర్లు ఎందుకు తిరగబడుతున్నారు? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ నుంచి గోడ దూకేయాలని అనుకున్నవారు దూకేశారు. పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నవారు సైలెంట్ అయ్యారు. ఒకరో ఇద్దరో మాట్లాడినా.. కేసులకు భయపడి దూకుడు తగ్గించేశారు. చూస్తుండగానే రెండున్నరేళ్లు గడిచిపోయింది. […]
బీజేపీ అంటే ఉత్తరాది పార్టీగా ముద్రపడింది. అందుకు తగ్గట్టుగానే ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఉత్తరాది బలంతోనే ఆపార్టీ దేశంలో అధికారంలోకి వస్తోంది. ఇటీవల వరుసగా రెండుసార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా దక్షిణాదిన బీజేపీ పాగా వేయలేక పోతుంది. దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక కర్ణాటక మాత్రమే. మిగిలిన రాష్ట్రాల్లో ఆపార్టీకి ఏమాత్రం బలం లేదు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలదే […]
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈ మధ్య అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఆయన తీసుకున్న నిర్ణయం బెడిసి కొడుతోందని సొంతపార్టీ నేతలు అంటున్నారు. రాజకీయాల్లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అపార చాణిక్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబుకు రాబోయే ఎన్నికలు ఛాలెంజ్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉండటం టీడీపీ అధినేత చంద్రబాబుకు కొత్త కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలనలో టీడీపీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకోవడం ఆయనకు మింగుడుపడటం లేదు. దీంతో జగన్ రెండోసారి […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్పత్రి లో చేరారు. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి లో చేరారు మంత్రి బొత్స సత్య నారాయణ. అయితే… మంత్రి బొత్స సత్యనారాయణ…. ఎందుకు ఆస్పత్రి లో చేరారనే దాని పై ఎలాంటి సమాచారం లేదు. కానీ ఆయన కరోనా చికిత్స నిమిత్తం ఆస్పత్రి లో చేరినట్లు సమాచారం అందుతోంది. గత రెండు రోజుల నుంచి మంత్రి బొత్స… కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని… ఈ […]